Yellow Alert To Telangana Districts: పశ్చిమ - మధ్య బంగాళాఖాతం వద్ద మయన్మార్ దక్షిణ తీరం దాని పరిసర ప్రాంతాల్లో రెండు ఆవర్తనాలు సోమవారం విలీనం కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ - మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 


ఈ జిల్లాల్లో వర్షాలు










మంగళవారం.. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


Also Read: KA Paul : పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!