ABP Health Conclave 2024: ABP దేశం నేతృత్వంలో 'Health Conclave 2024' శుక్రవారం ప్రారంభించారు. ABP Digital Video Head సునీల్ గోస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. పలువురు వైద్య నిపుణులు ప్రస్తుత ఆరోగ్య సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మధుమేహం హెల్త్ డైట్, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఎలాంటి డైట్ పాటించాలి, బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు, మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల జరిగే అనర్థాలు వంటి అంశాలపై ప్రముఖ టైటీషియన్ నిఖిల్ చౌదరి, ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ ఊర్వశి అగర్వాల్ వివరించారు. 


'మధుమేహం జన్యుపరమైనది కాదు'


ప్రస్తుత రోజుల్లో ప్రధాన అనారోగ్య సమస్య డయాబెటిస్. చిన్న వయస్సులోనూ చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారని ప్రముఖ టైటీషియన్ నిఖిల్ తెలిపారు. 'మధుమేహం నిజానికి జన్యుపరమైన వ్యాధి. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయని అనుకుంటారు. అయితే, మధుమేహం జన్యుపరమైనది కాదు. కుటుంబంలో ఒకే రకమైన ఆహారం, జీవనశైలి విధానం మధుమేహానికి కారణం కావొచ్చు. ప్రపంచంలోని సగటు జనాభాలో 100 ఏళ్లకు పైగా జీవించే జనాభాలో ఇప్పుడు జరుగుతున్న అధ్యయనాలను పరిశీలిస్తే మారుతున్న జీవన శైలి వ్యాధులకు ప్రధాన కారణం. హైపర్‌ టెన్షన్ లేదా ఫ్యాటీ లివర్ లేదా కొలెస్ట్రాల్ వంటి సమస్యలు మన ఆహారం, జీవనశైలితో ముడిపడి ఉంటుంది' అని పేర్కొన్నారు.


'మన ఆహారమే నెం.1'


అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ప్రధానమైనది మనం తీసుకునే ఆహారమేనని నిఖిల్ తెలిపారు. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా కొలెస్ట్రాల్, మధుమేహం వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని సూచించారు.