Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్:  లక్కీ, జున్ను ప్లాన్‌కి లక్ష్మీ అరవిందకు దొరికిపోయిందా.. వీడియో మేటర్‌లో మనీషాకు పెద్ద షాక్!

chiranjeevi lakshmi sowbhagyavathi today episode అరవింద తన తల్లి చావుకి కారణమైందన్న వీడియో చూపించి లక్ష్మీని బెదిరించాలని ప్రయత్నించిన మనీషాకు లక్ష్మీ షాకివ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: సంయుక్త, జాహ్నవిలు ఉంటున్నారని దేవయాని మనీషా మీద చిరాకు పడుతుంది. లక్ష్మీనే తెలివిగా మారి వచ్చిందని మనీషా అంటుంది. సంయుక్తని పట్టుకొని లక్ష్మీ అంటావ్ ఏంటని దేవయాని మనీషాని మీద అరుస్తుంది.

Continues below advertisement

 మనీషా: తను కచ్చితంగా లక్ష్మీనే. లేకపోతే ఎందుకు జానుతో అక్క అని పిలిపించుకుంటుంది. అరవింద అత్తయ్యతో ఎందుకు లక్ష్మీ అని పిలిపించుకుంటుంది. ఇప్పుడు కూడా మీకు తన మీద అనుమానం కలగడం లేదా.
దేవయాని: అబ్బా మనీషా ఇంత చిన్న వాటికే నువ్వు తనని లక్ష్మీ అని ఎందుకు అంటావ్. 
మనీషా: తను లక్ష్మీ ఏదో ఒక రోజు తన నిజస్వరూపం బయట పెడుతుంది.
దేవయాని: సరే అయితే నిరూపించు.
మనీషా: కచ్చితంగా నిరూపిస్తా ఆంటీ. మా అమ్మ చనిపోయిన వీడియో మళ్లీ బయటకు తీస్తా ఆ లక్ష్మీకి చూపిస్తా. అరవింద ఆంటీని జైలుకి పంపిస్తా అంటే అప్పుడే లక్ష్మీ బయట పడుతుంది.
దేవయాని: సరే అయితే తను లక్ష్మీ కాకపోతే ఎలాంటి రియాక్షన్ ఉండదు అంటావ్ అంతే కదా.

జున్నుకి లక్కీ ఏదో ప్లాన్ చెప్తుంది. అలా చేస్తే సంయుక్త మీ అమ్మ కాదో తెలుస్తుందని అంటుంది. జున్ను బయపడుతూనే లక్కీ చెప్పింది చేయడానికి సిద్ధపడతాడు. జున్ను ఫాస్ట్‌గా పరుగెత్తుకుంటూ వెళ్లి పడిపోయి దెబ్బ తగిలినట్లు నటిస్తాడు. జాను, జున్నులు చూసి జున్ను అని ఏమైందని నార్మల్‌గా మాట్లాడుతుంది. అరవింద, జయదేవ్‌లు అక్కడికి వస్తారు. అక్క మామూలుగా మాట్లాడేస్తుందేంటని అనుకుంటుంది. లక్కీ జున్నుతో ఇప్పటికైనా తను మీ అమ్మ అని ఒప్పుకుంటావా అని అంటుంది. ఇక లక్ష్మీ తర్వాత తేరుకొని ఫారిన్ అమ్మాయిగా మాట్లాడుతుంది. జున్ను, లక్కీలతో మీరు కావాలంటే అమ్మ అని పిలవమని అంటుంది. లక్కీ, జున్నులను జాను పంపేస్తుంది. ఇక జున్నుతో లక్కీ హోమ్ టూర్ వీడియో చూపిద్దామని అంటుంది. మరోవైపు మిత్ర సంయుక్తని ఇళ్లంతా చూపిస్తాడు. సంయుక్త మిత్రతో తన గది కూడా చూపించమని అంటుంది. సంయుక్త మిత్ర గది చూసి తను మిత్రతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది.

మందు తాగే అలవాటు ఉందా అని సంయుక్త మిత్రతో అడుగుతుంది. దానికి మిత్ర అప్పుడప్పుడు తాగుతా అంటాడు. ఎప్పుడు అని సంయుక్త అడిగితే లక్ష్మీ గుర్తొచ్చినప్పుడు కోపంతో తాగుతాను అని అంటాడు. లక్ష్మీ తనని మోసం చేసిందని కుటుంబం మొత్తాన్ని రోడ్డకు ఈడ్చేసిందని మిత్ర అంటాడు. ఇక మిత్ర తనని అవాయిడ్ చేస్తానని అంటాడు. దానికి సంయుక్త తనని అవాయిడ్ చేయాలి అంటే నన్ను కూడా అవాయిడ్ చేయాలి అంటుంది. ఎందుకు అని మిత్ర అంటే తన రూపంలో నేను ఉన్నానని అంటుంది. ఇక మిత్రకు తన భార్య ఫొటో చూపించమని అంటుంది. మిత్ర చూపించగానే ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది మిత్ర చూసి ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే తనలాగే ఉందని చనిపోయిందని అంటుంటే బాధగా ఉందని అంటుంది. దానికి మిత్ర బాధ పడే అంత గొప్ప క్యారెక్టర్‌ కాదని అంటాడు. ఇక మిత్ర లక్ష్మీ వల్ల తాను ఎంత నష్టపోయాడో చెప్తాడు. 

మనీషా: నువ్వు భలే నటిస్తున్నావే. నువ్వు నేను క్లాస్ మేట్స్ అని నేను అబద్ధం చెప్పాను. నువ్వు భలే అల్లేశావ్.
సంయుక్త: నాకు అల్లుకుపోవడం అలవాటు. ఏదో అడగాలి అని వచ్చి ఏదో అడుగుతున్నావ్. డైరెక్ట్‌గా అడుగు.
మనీషా: చచ్చిందో బతికుందో తెలియని ఈ ఇంటి కోడలి గురించి బాగానే ఆలోచిస్తున్నావ్ బాగా ఆరాతీస్తున్నావ్. లక్ష్మీకి ఒక వీడియో అంటే చాలా ఇష్టం ఒక విధంగా భయం కూడా. ఆ వీడియో కొన్నేళ్ల క్రితం మా అమ్మ అరవింద ఆంటీ వల్ల ఎలా చనిపోయిందో అని ఉంటుంది. అందుకే ఈ వీడియో బయటకు తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా.
సంయుక్త: అరవింద ఆంటీ వల్లే మీ అమ్మ చనిపోయిందని అనుకుంటే ఇప్పటి వరకు ఎందుకు ఆగావు ఆ వీడియో ఎందుకు పోలీసులకు చూపించలేదు. కోర్టు మెట్లు ఎక్కాల్సింది. ఇక పోలీసులు ఈ కేసు తీసుకోరు కూడా ఎందుకు ఈ విషయం ముందే చెప్పాలేదని ప్రశ్నిస్తారు. లక్ష్మీ బతికే ఉంటే ఆ వీడియో పట్టించుకోదు. నువ్వు లేట్ చేయడం వల్ల అరవింద ఆంటీని ఏం చేయలేవు కూడా. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: సంధ్య వల్ల కేసు టేకప్ చేసిన ధనుంజయ్.. సత్య, క్రిష్‌లు ఇంట్లో లేరని మహదేవయ్యకు తెలిస్తే!

Continues below advertisement