హుజురాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారాన్ని జోరుగానే కొనసాగిస్తున్నాయి. టీఆర్ఎస్  బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు సామాజికవర్గాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా రెడ్డి సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. హుజూరాబాద్ లో జరిగే ఎన్నిక న్యాయానికి - అన్యాయానికి, ధర్మానికి - అధర్మానికి మధ్య జరిగే ఎన్నికగా తేల్చారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం  ఏం చేసింది... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ఆలోచించి ఓట్లేయాలని సమావేశంలో పాల్గొన్న వారికి సూచంచారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిందని.. అలాగే రైతు బంధు, రైతు బీమాను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చేశామని.. రైతుల కోసం రైతు వేదికలు కట్టించామన్నారు. 


Also Read : క్షమాపణ చెప్పిన జగ్గారెడ్డి - టీ కాంగ్రెస్‌లో సద్దుమణిగిన వివాదం


బీజేపీ ప్రభుత్వం బోర్లకు మీటర్లు పెట్టమని చెబుతోందన్నారు. డీజీల్ రేట్లు పెంచడం ద్వారా ఒక్క ఎకరా వ్యవసాయం చేయడానికి ఐదు వేల రూపాయలు భారం పడేలా చేసిందని హరీష్ గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం పని చేసే తెరాస గెలవాలా..  కోతలు, వాతలు పెట్టే బీజేపీ గెలవాలా ఆలోచించాలన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి పక్క ఊళ్ల నుంచి జనాలను తెచ్చారని ఈటల అంటున్నారని.. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో రాజేందర్ మాటల్లో నిజం అంతే ఉంటుందని సెటైర్ వేశారు.  భోజనం కోసం, మందు కోసం వస్తున్నారని ఆరోపిస్తూ హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఈటల మాట్లాడుతున్నారన్నారు.  రాజేందర్ ను చిత్తు చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 


Also Read : కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?


ఈటల స్వార్థం కోసం పార్టీ మారారని..  బీజేపీ  ఏ రకంగా హుజూరాబాద్ ప్రజలకు మేలు చేస్తోందో చెప్పాలని సవాల్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, చేతనైతే హుజూరాబాద్ కు వెయి కోట్ల ప్యాకేజీ  ఇప్పించాలని సవాల్ చేశారు. ప్రతీ అక్కౌంట్ లో15 లక్షలు వేస్తామన్నారు. నీకు చైతనైతే 15 లక్షలు వేయించు చూద్దామని ఈటలకు సవాల్ చేశారు. ప్రజలకు, రైతులకు అన్యాయం జరిగినా పర్వాలేదా..నువు మాత్రం బాగుండాలా అని ఈటలను ప్రశ్నించారు. ఈటల  సిలిండర్ ధర తగ్గిస్తారా, పెట్రోల్ డిజీల్ ధర తగ్గిస్తారా అని ప్రశ్నించారు.  


Also Read : తెలంగాణలోనూ ప్రభుత్వ మటన్ మార్టులు.. హోల్ సేల్ అండ్ రీటైల్ !


 
రెడ్డి సోదరుల్లో సొంత స్థలం ఉన్న పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని హరీష్ హామీ ఇచ్చారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ లో ఒక్క పేదవాడికి ఇళ్లు ఇవ్వని ఈటల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలను ఈటల మోసం చేయలేరన్నారు. తాను హుజురాబాద్ ప్రజలకు ఐదు వేల ఇళ్లు మంజూరు చేయిస్తానని ప్రకటించారు.  భవిష్యత్తులో సీఎంగారి ఆశీస్సులతో రెడ్డి కార్పోరేషన్ సాధించుకుందామని హామీ ఇచ్చారు. 


Also Read : ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి