JP Nadda : 'ఓరుగల్లు గడ్డ పై అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా' అని తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. 3వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర" ముగింపు సభలో పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే... సీఎం కేసీఆర్ అంధకారంలోకి నెట్టేసిన తెలంగాణలో వెలుగులు నింపడమే అన్నారు. 


కేసీఆర్ ఇదే చివరి ఫర్మాణా 


 "కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. నేను 2వ విడత పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా...బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం. ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడం ఖాయం. అప్పట్లో నిజాం జన సభలు పెట్టుకోవద్దని చివరి ఫర్మాణా జారీ చేశాడు. అదే ఆయనకు చివరిది అయింది. ఇప్పుడు కేసీఆర్ కూడా సభలు పెట్టుకోవద్దని ఫర్మాణాలు జారీ చేస్తున్నారు. కేసీఆర్ కు కూడా ఇదే చివరి ఫర్మాణా అవుతుంది. తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం నిధులు మంజూరు చేసినా...సీఎం కేసీఆర్ వాటిని ఖర్చు చేయలేదు. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో... తన బొమ్మ పెట్టుకుని, తన స్కీమ్స్ గా ప్రచారం చేసుకుంటున్నారు."- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు 






కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎమ్ 


తెలంగాణను ఏర్పాటు చేయాలని కాకినాడలో మొదట తీర్మానం చేసిందే బీజేపీ అని జేపీ నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ATMలా మారిందని విమర్శించారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.40 లక్షల కోట్లకు పెంచుకుని, డబ్బు దండుకున్నారన్నారు. మజ్లిస్ కు భయపడే.. కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. 'తెలంగాణ విమోచన దినోత్సవం' ను అధికారికంగా జరుపుతామన్నారు. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు చుక్కలు చూపిస్తామన్నారు. కేసీఆర్ అవినీతి, తానాసాహి పాలనను బొందపెడతామని జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 


Also Read : Praja Samgrama Yatra : ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర, జేపీ నడ్డాతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనం


Also Read : TS BJP Cine Glamour : తెలంగాణ బీజేపీకి స్టార్ అట్రాక్షన్ ! పిలిస్తే తిరస్కరించే ధైర్యం ఎవరికైనా ఉందా !?