కమెడియన్ అలీ పెద్ద కూతురు ఎంగేజ్మెంట్ చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరిగింది. సోషల్ మీడియాలో అలీ ఉన్నప్పటికీ కూతురి పెళ్లి కబురును మాత్రం పంచుకోలేదు. ఆమె ఈ మధ్యనే ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టరుగా మారింది. ఆ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతాలో చెప్పారు అలీ. తన కుటుంబంలో డాక్టర్ అయిన తొలి వ్యక్తి తన పెద్ద కూతురు ఫాతిమానే అని చెప్పారు. త్వరలో ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా కూడా వెళ్లబోతోంది. ఈలోపు ఆమెకు పెళ్లి సంబంధం చూసి ఎంగేజ్మెంట్ కూడా చేశారు. ఎంగేజ్మెంట్ వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశారు. ఇప్పుడది వైరల్ గా మారింది.
డాక్టర్ల ఫ్యామిలీకే...
అలీ కూతురు ఫాతిమా వైద్యవిద్యను అభ్యసించింది. ఆమె చేసుకోబోయేది కూడా వైద్యుడినే. కాకపోతే అతని పేరు, వివరాలు తెలియరాలేదు. కాగా అతని కుటుంబంలో అందరూ డాక్టర్లే కావడం విశేషం. పెళ్లి కొడుకు చెల్లి, బావ కూడా వైద్యులే. అలాగే అన్నయ్య, వదినా కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి నటుడు సాయికుమార్ భార్యా సమేతంగా వచ్చారు. అలాగే బ్రహ్మానందం కూడా హాజరయ్యారు. కొంతమంది ఈటీవీ ప్రొడ్యూసర్లు వచ్చారు. సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ రాలేదు. పెళ్లికి ఇండస్ట్రీ పెద్దలను పిలిచే అవకాశం ఉంది.
Also read: బుజ్జి బేబీ బంప్‌తో అలియా, ఆమె వేసుకున్న ఈ పింక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
Also read: ‘ఆంటీ’ అని పిలిస్తే కేసు పెట్టొచ్చా? ఆ పిలుపు నేరమా? న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారు
అలీ భార్య జుబేదా అలీ యూట్యూబ్‌లో చురుకుగా ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే అయిదు లక్షలకు పైగా సబ్ స్బైబర్లను పొందారు. ఆమెనే తన కూతురి ఎంగేజ్ మెంట్ విషయాన్ని అభిమానులకు తెలిపారు. అలీకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు ఫాతిమా.