Gadwal Bidda Passes Away: సోషల్ మీడియా సంచలనం "గద్వాల్ బిడ్డ"గా ఫేమస్ అయిన బాలుడు ఇకలేడు. ఎస్ మల్లికార్జున్ రెడ్డి అనే బాలుడు అనారోగ్యంతో ఆదివారం చనిపోయాడు. జోగులాంబా గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి అంటే సోషల్ మీడియాలో తెలియని వారు ఉండరు.
కొన్నేళ్ల కిందట దళితులపై చేసిన వ్యాఖ్యలతో అతడు వెలుగులోకి వచ్చాడు. దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, పెద్దలు మందలించడంతో తాను చేసింది తప్పు అని తెలుసుకుని క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దు మణిగింది. చిన్నతనంలోనే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయర్లను సంపాదించుకున్న వారిలో మల్లికార్డున్ తప్పక ఉంటాడు. అతడిపై మీమ్స్ సైతం వాట్సాప్‌లో షేర్ అవుతుంటాయంటే బాలుడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి చిన్నతనం నుంచి ఆస్తమాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం మల్లికార్జున్ రెడ్డి తుదిశ్వాస విడిచాడు. తన డైలాగ్స్, హావభావాలతో సోషల్ మీడియాలో నెటిజన్లకు, ఫాలోయర్లకు హాస్యాన్ని పంచిన బాలుడు చిన్న వయసులో చనిపోయాడని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ‘గద్వాల్ బిడ్డ’ మల్లికార్జున్ రెడ్డి వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు చిన్నారులు తమ ముద్దు ముద్దు మాటలతో వైరల్ అవుతుంటే.. కొందరు కామెడీ చేస్తారు, మరికొందరు విలక్షణ కామెడీ, లేదా వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండ్ అవుతుంటారు. మల్లికార్జున్ మొదట వివాదాస్పద కామెంట్లతో వెలుగులోకి వచ్చినా.. ఆపై అతడి మాటలు ఇతరులకు భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో అతడి మీమ్స్ వైరల్ అవుతుంటాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మ పై మల్లికార్జున్ రెడ్డి చేసిన వీడియోకు విశేష స్పందన లభించింది. వర్మపై కామెంట్స్ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
నేడు అంత్యక్రియలు..
స్వగ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నెలో నేడు మల్లికార్జున్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బాలుడి సమీప బంధువులు తెలిపారు. మీమ్ స్టార్ చనిపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు. RIP చిన్నా, రిప్ గద్వాల రెడ్డి బిడ్డ పేరిట సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Gupta Nidhulu: వరంగల్‌లో గుప్త నిధులు, 1000 బంగారు నాణెల కేసులో 8 మంది అరెస్ట్.. ఎన్నో ట్విస్టులు
Also Read: India Corona Cases: దేశంలో లక్ష దిగువకు పాజిటివ్ కేసులు, తాజాగా కొవిడ్‌తో 895 మంది మృతి
Also Read: Nizamabad News: ఇందూరు జిల్లా నిజామాబాద్ ఎలా అయ్యింది, పేరు మార్చడానికి కారణం ఇదే