భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే కరోనా టీకా.. రెండు, మూడో దశ క్లినికల్ పరీక్షలకు కేంద్రం అనుమతించింది. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్‌ పరీక్షలను భారత్​ బయోటెక్​ పూర్తి చేసింది.


ముక్కు ద్వారా వేసే కరోనా టీకాలు రానున్నాయి. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ అందరికంటే ముందు నిలిచింది. ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే తొలిదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. తొలిదశలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారిపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు.


Also Read: Independence Day Special: కరోనా కారణంగా బయట అడుగు పెట్టే పరిస్థితి లేదంటారా…అయితే ఇంట్లోనే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోండిలా


కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ‘కొవాగ్జిన్‌’ టీకాను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌.. ముక్కు ద్వారా ఇచ్చే టీకా-బీబీవీ154- అడెనోవైరస్‌ వెక్టార్డ్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఆవిష్కరణపై దృష్టి పెట్టింది. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించింది. గతేడాది సెప్టెంబరులో భారత్‌ బయోటెక్‌, యూఎస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ కరోనాపై సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది.


Also Read: Marburg Virus: ముంచుకొస్తున్న ‘మార్బర్గ్ వైరస్’.. కరోనా కంటే ప్రాణాంతకం, లక్షణాలివే!


ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన లాన్‌కాస్టర్‌ యూనివర్సిటీకి శాస్త్రవేత్తల బృందం ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ను ఎలుకలపై చేసిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ విషయం తెలిసింది. వ్యాక్సిన్‌ రెండు డోసులను ఎలుకలకు ముక్కు ద్వారా ఇచ్చి.. అనంతరం ఆ ఎలుకల్లోకి వైరస్‌ను పంపించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


Also Read: Covid 19 Vaccine Mixing: 'ఆ రెండు టీకాలు కలిపి తీసుకుంటే కరోనా నుంచి డబుల్ రక్షణ'


టీకా వల్ల ఎలుకల్లో వైరస్‌ను ఎదుర్కొనే విధంగా రోగనిరోధక శక్తి పెరగడం సహా ముక్కులోగాని, ఊపిరితిత్తుల్లోగాని వైరస్‌ పునరుత్పత్తి జరగలేదని వెల్లడించారు. వాటిలో ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, ఇతర వైరస్‌ ప్రభావిత సమస్యలు ఏవీ కనిపించలేదని చెప్పారు. మనుషుల్లో వినియోగం కోసం ఒక ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ రిజిస్టర్‌ చేసి ఉందన్న శాస్త్రవేత్తల బృందం.. ఇది వైరస్‌ ఎదుర్కొవడంలో అత్యంత సమర్థవంతగా పని చేస్తుందని ఇప్పటికే రుజువైందని వెల్లడించారు.


Also Read: Covid Third Wave: కరోనా థర్డ్ వేవ్ దగ్గర పడిందా? నిర్లక్ష్యమే కారణమా?