Eetala Rajender: మాజీ మంత్రి, బీజేపీ నేత ఎ చంద్రశేఖర్ ను ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కలిశారు. చంద్రశేఖర్ తో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల సమావేశమై పలు విషయాల గురించి చర్చించారు. చంద్రశేఖర్ పార్టీని విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే మంత్రి ఈటల రాజేందర్ ఆయన నివాసానికి వెళ్లి.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. బీజేపీలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... చంద్రశేఖర్, తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామని తమకు ఉమ్మడి ఎజెండా ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను గద్దె దించడం కోసం పని చేస్తామని అన్నారు. వరంగల్ రీజియన్ వరకే ప్రధాని మోదీ మీటింగ్ జరిగిందని.. అందువల్లే చంద్రశేఖర్ కు పాస్ రాలేదని చెప్పారు. అంతే కానీ ఈయనకు పాస్ ఇవ్వకపోవడానికి కారణం మరకొటి కాదన్నారు. పార్టీ బాగుండాలని ఈ భేటీలో చర్చ వేసినట్లు మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు. పార్టీని ఎలా బాగు చేయాలో చెప్పానన్నారు.