BJP News : తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఇస్తారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నందున రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉందంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదేన్నారు. తనను ఎలా ఉపయోగించుకోవాలో అన్నది బీజేపీ హైకమాండ్ ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఈటల రాజేంద్ర తీవ్ర విమర్శలు చేశారు.
ధరణితో రైతుల కొంప ముంచిన కేసీఆర్ సర్కార్
కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి రైతుల కొంపలు ముంచింది. ధరణి సమస్యల వల్ల రైతులు ఆగం అవుతున్నారు. ధరణిలో 18లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పేదలకు సెంటు భూమి ఇవ్వాలేదు. రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న దళిత రైతుల 5800 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఎకరాకు 300 గజాలు ఇచ్చి పేదల భూములను లాక్కున్నారు. కోర్టులకు పోలేక రైతులు బ్రోకర్లకు భూములు అమ్ముకునే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని ఈటల అన్నారు. ఎల్లమ్మ బండ భూములు, మియాపూర్ భూముల స్కాం ఎందుకు భయట పెడతలేదు కేసీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు.
జాతీయ అంశాలపై నోరు మెదపని నయా దేశ్ కీ నేత కేసీఆర్ - ఈ మౌనం దేనికి సంకేతం !?
భూములు కొల్లగొట్టేందుకే జీవో 111 రద్దు
111 జీవోలో ఉన్న భూములు ఆంధ్ర వ్యాపారులు కొల్లగొడుతున్నారని చెప్పారని.. కానీ.. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి మాటున రైతుల పొట్టగొడుతూ 111 జీవోను కేసీఆర్ రద్దు చేశాడరని మండిపడ్డారు. 1908 – 1927 మధ్య కాలంలో రెండు జలాశయాలు నిర్మాణం జరిగింది. రెండు జలాశయాలతో సాగు, తాగు నీరు అందాయి. గొప్ప లక్ష్యంతో ఆనాడు నిజాం సర్కార్ జలాశయాలను నిర్మించింది. కేసీఆర్ మేధస్సుతో నిర్మించిన కాళేశ్వరం మోటర్లు మునిగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఈటల ప్రశ్నించారు. 111 జీవో రద్దుతో రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 1.32 లక్షల ఎకరాల్లో 18వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. అభివృద్ధి చాటున పర్యావరణ విధ్వంసం చేస్తారా కేసీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు.
డింపుల్ వర్సెస్ ఐపీఎస్ రాహుల్ కేసులో బల్దియాకు చిక్కులు, అలా ఎలా వదిలేశారు సార్?
ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో రాజకీయాలు
మీ తీరుతో హైదరబాద్ కాంక్రీట్ జంగిల్ కాబోతోంది. వరదలు వస్తె పడవలేసుకుని తిరిగే పరిస్థితులు ఉన్నాయి. వెంటనే 111జీవో రద్దును విరమించుకోవాలి. వరదలకు అస్కారం లేకుండా జంట జలాశయాలకు విఘాతం కలగకుండా రైతులకు మేలు చేసే విధంగా పాలన ఉండాలని ఈటల కేసీఆర్ కు సూచించారు. తెలంగాణ సొమ్ముతో కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సొమ్ముతోనే కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నాడంటూ ఈటల ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలో ప్రతినిధులకు స్థానం లేదు, మీడియాకు స్థానం లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరిక వ్యవస్థనా కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.