Etala Rajendar : టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 3 నెలలే ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.  ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలో ప్రజాగోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. కేసీఆర్ ఉపఎన్నికలు ఉంటే తప్ప ఫౌంహౌజ్ నుంచి బయటికిరాడని ఈటల విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టని ప్రభుత్వం.. విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తుందనుకోవడం భ్రమేనన్నారు.  ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తెలివైనవారని.. కేసీఆర్ జిమ్మిక్కులు బాగా అర్థమై ఉంటాయని ఈటల అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలచేతిలో కేసీఆర్కి పరాభవం తప్పదన్నారు. 


ఆదిలాబాద్ జిల్లాలో  ప్రజాగోస - బీజేపీ భరోసా యాత్ర 


కేసీఆర్ ప్రభుత్వం ప్రజల గోస ఏనాడూ పట్టించుకోలేదని.. ప్రజల సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలెప్పుడు వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని భీంసరీ, చాంద, యాపాల్ గూడ, అనుకుంట గ్రామాల్లో నిర్వహించిన ప్రజా గోస.. బీజేపీ భరోసా.. యాత్ర కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ రోడ్డు నుండి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.


కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం 


అనంతరం జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కెసిఆర్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 


భారత్ - ఆసీస్ మ్యాచ్ టిక్కెట్ల కోసం పడిగాపులు - ఏ విషయం చెప్పని హెచ్‌సీఏ ! అసలేం జరుగుతోంది ?


అమిత్ షాతో ఏకాంత చర్చల తర్వాత మరింత ఘాటుగా ఈటల వ్యాఖ్యలు


ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా ఈటల రాజేందర్‌తో ఆయన ఇంట్లో సమావేశం అయ్యారు.  బీజేపీ అధికారంలోకి రావాలంటే అవ‌స‌ర‌మైన కార్య‌చ‌ర‌ణ నివేదిక‌ను అమిత్ షా చేతికి అందించారు ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌. 90 సీట్లు గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా మిష‌న్ 90 రిపోర్ట్ లో కీల‌క అంశాల‌ను పొందుప‌రిచారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు, ప్ర‌త్య‌ర్థి పార్టీల బ‌ల‌హీన‌త‌లు, విధాన ప‌ర‌మైన హామీల్లాంటివన్నీ అందులో చెప్పారని. అంటున్నారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కీలకమైన రాజకీయ పరిణామాలు జరుగుతాయని.. ప్రభుత్వం కూలిపోతుందని ఈటల అంచనా వేయడానికి.. అమిత్ షా తో జరిగిన  చర్చలు కూడా ఓ కారణం అని భావిస్తున్నారు. 


గిరిజన రిజర్వేషన్ల రాజకీయం పులి మీద స్వారీనే - బీజేపీ, టీఆర్ఎస్‌లో ఎవరికి మైనస్ ?