Election Comission Denied Permission To Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశానికి (Telangana Cabinet Meeting) కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శనివారం సాయంత్రం కేబినెట్ భేటీ కానుందని రెండు రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ మధ్య విభజన వివాదాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు మంత్రి మండలి సమావేశం కావాలని నిర్ణయించింది. అయితే, ఓ వైపు లోక్ సభ ఎన్నికల కోడ్, మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సాగుతోన్న నేపథ్యంలో ఈసీ కేబినెట్ భేటీకి అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, ఈ నెల 27న ఖమ్మం - వరంగల్ - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. అటు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ముగియనుంది. 


Also Read: Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం