Directors Day Revanth Reddy Invitation: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అతిరథ మహారధులను ఎందరికో ఆహ్వానం పలుకుతున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
రెవంత్ రెడ్డికి ఆహ్వానం..
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా.. అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. శుక్రవారం సాయంత్రం సీఎంని కలిసిన సభ్యులు.. ఆయనతో మాట్లాడారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించిన సీఎం కచ్చితంగా వేడుకకు హాజరు అవుతానని చెప్పినట్లు సభ్యులు చెప్పారు. సీఎంకి తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీపై మంచి ఆలోచనలు ఉన్నాయని, విజన్ ఉందని సభ్యులు చెప్పారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.
హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం టీఎఫ్ డీఏ ప్రెసిడెంట్ శంకర్ మాట్లాడారు. "నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వశిష్ట మరికొందరు కలిశాం. ఐదు నిమిషాలు మాట్లాడాలని వెళ్తే సుమారు గంట సేపు మాతో సినిమా ఇండస్ట్రీ గురించి సీఎం మాట్లాడటం హ్యాపీగా అనిపించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి సీఎం గారి విజన్ తెలుసుకుని ఆశ్చర్యం వేసింది. ప్రపంచ సినిమా హబ్ గా టాలీవుడ్ మారాలని, ఆ దిశగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వరల్డ్ క్లాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాం. డైరెక్టర్స్ డే ను ప్రపంచమంతా గుర్తుపెట్టుకునేలా ఈ ఈవెంట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా వస్తామని మాటిచ్చారు" అని చెప్పారు శంకర్.
Also Read: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్