Malayalam Actor In SSMB 29: దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమా ఎస్ఎస్ఎమ్‌బీ 29. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు, ఇతర క్యాస్టింగ్ ఎవరు లాంటి వివరాలను మూవీ టీమ్ ఫైనల్ చేయకపోయినా.. దీనికి సంబంధించిన ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక మలయాళ నటుడు ఈ మూవీలో భాగం కానున్నాడని రూమర్స్ బయటికి వచ్చాయి.


మలయాళ నటుడు..


మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీ గురించి ఏదో ఒక రూమర్ బయటికి రావడం, దానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం రెగ్యులర్‌గా జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం ఫేమస్ క్యాస్టింగ్ డైరెక్టర్ అయిన వీరేన్ స్వామిని ఈ సినిమా కోసం రంగంలోకి దించనున్నట్టు వార్తలు రాగా అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని మూవీ టీమ్ కొట్టిపారేసింది. ఇప్పుడు ఈ మూవీలో ఒక మలయాళ నటుడు నటించనున్నాడని రూమర్స్ మొదలయ్యాయి. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్.. మహేశ్, రాజమౌళి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న పృథ్విరాజ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.


ఇతర ఇండస్ట్రీల్లో హైప్..


మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్విరాజ్ సుకుమారన్.. ఇప్పుడిప్పుడే తెలుగు మార్కెట్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’లో నటించడానికి ఒప్పుకున్నాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలా మహేశ్ బాబు, రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా పృథ్విరాజ్ ఒప్పుకుంటాడేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. పైగా పృథ్విరాజ్ లాంటి హీరోను ఈ మూవీలో క్యాస్ట్ చేయడం వల్ల ఈ సినిమాకు మాలీవుడ్‌లో కూడా మంచి హైప్ క్రియేట్ కానుందని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కే సినిమాల్లో ఇతర భాషా స్టార్లను తీసుకోవడం వల్ల వేరే ఇండస్ట్రీల్లో కూడా ఈ మూవీపై ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ అవుతుంది.


కొత్త లుక్ కోసం..


రాజమౌళి సినిమా కోసం మహేశ్ బాబు ఇంకా కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. వర్క్‌షాప్స్‌కు కూడా అటెండ్ అవుతున్నాడు. అయితే ఈ మూవీలో మహేశ్ బాబు గడ్డం, పొడుగు జుట్టుతో కనిపించనున్నాడని ఇప్పటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. తను ఏ పబ్లిక్ ఈవెంట్‌కు వచ్చినా తన కొత్త లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో కొన్నాళ్ల పాటు మహేశ్.. పబ్లిక్‌లోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అలా అయితే న్యూ లుక్‌లో మహేశ్ బాబును చూడడానికి సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే. అంతే కాకుండా ఈ ఏడాది చివరిలోపు మూవీ ప్రీ ప్రొడక్షన్‌ను కూడా ప్రారంభించి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.


Also Read: కారులో బార్.. వారెవ్వా నరేష్ కార్ల కలెక్షన్స్ చూస్తే ఔరా అంటారు, దేనికదే ప్రత్యేకం!