యాదగిరి గుట్ట పేరును ( Yadagiri Gutta ) యాదాద్రిగా ( Yadadri ) మారుస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకుని నిర్ణయించినప్పుడు ప్రకటించారు. ఈ యాదాద్రి పేరును చినజీయర్ స్వామి సూచించారన్న ప్రచారం కూడా జరిగింది.  ఏపీలోని తిరుమల స్థాయిలో అభివృద్ధి చెందాలని .. యాదాద్రి అని పేరు పెట్టినట్లుగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని యాదగిరి గుట్టగానే ప్రస్తావిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR ) సోమవారం పర్యటనకు సంబంధించి మొత్తం వివరాలు యాదగిరి గుట్ట పేరుతోనే ప్రభుత్వం ఇస్తోంది.  యాదాద్రి అనే పేరును వాడటం లేదు. 


వచ్చే ఏప్రిల్‌లో తెలంగాణలో ఎన్నికలు- టీఆర్‌ఎస్‌తో ప్రశాంత్ కిషోర్‌ చర్చలు అందుకే- బాంబు పేల్చిన రేవంత్


యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చినట్లుగా గతంలో అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయో లేదో స్పష్టత లేదు.  చాలా కాలంగా యాదాద్రి అనే ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు  ప్రభుత్వ వ్యవహారికంలో కూడా యాదగిరి గుట్ట అనే ప్రస్తావిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పర్యటన మొత్తం అధికారిక సమాచారంలో యాదగిరి గుట్ట అనే ఉంది. దాంతో  యాదాద్రి పేరును ఇక తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని భావిస్తున్నారు. 


తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ


యాదాద్రి అనే పేరును చినజీయర్ ( China Jeeyar ) సూచించారు. ఆయన సూచన మేరకు పేరు ను కూడా కేసీఆర్ మార్చారని చెబుతారు.  చినజీయర్‌తో వివాదం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనకు దూరంగా ఉంటున్నారు.  ఈ క్రమంలో ఆయన యాదాద్రి పేరును కూడా మళ్లీ గుట్టగానే పిలవాలని డిసైడయినట్లుగా భావిస్తున్నారు.  కొంత కాలంగా యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగానే పిలవాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. 


తెలంగాణ కాంగ్రెస్‌లో పీకే ప్రకంపనలు- సంచలనంగా మారిన ఠాగూర్‌ ట్వీట్‌


యాదగిరి గుట్ట అనేది తెలంగాణ జన  బాహుళ్యంలో విశ్లేష ప్రాచుర్యం పొందింది. నరసింహా స్వామి దగ్గరకు వెళ్లడం కన్నా గుట్టకు వెళ్లొద్దామా అనే మాట్లాడుకుంటారు. యాదాద్రి అని పేరు మార్చిన తర్వాత కూడా అది మారలేదు. దానికి తోడు చినజీయర్‌తో విభేధాలు కూడా కలిసి వచ్చి.. మళ్లీ యాదాద్రి పేరు యాదగిరి గుట్ట అయిపోయినట్లుగా తెలుస్తోంది.  ఇక నుంచి యాదాద్రి అనే పేరు ఎక్కువగా వినిపించకపోవచ్చని.. యాదగిరి గుట్టగానే ప్రాచుర్యంలోకి వస్తుందని భావిస్తున్నారు.