TS Police Notification : తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80 వేలకు పైగా ఉద్యోగాల్లో తొలి నోటిఫికేషన్ విడుదలైంది. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం విడుదల అయింది. కానిస్టేబుల్,  ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 16,027 కానిస్టేబుల్‌, 587 ఎస్‌ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. www.tslprb.in  సైట్ ద్వారా ఉద్యోగార్థులు అప్లై చేసుకోవచ్చు. 


తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లికేషన్లు ఆహ్వానించింది. అభ్యర్థులు మే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 



  • పోలీస్ కానిస్టేబుల్(సివిల్) -   పే స్కేల్ రూ. 24280- రూ.72850   - ఖాళీలు 4965 

  • పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) - రూ.24280-రూ.72850                       - ఖాళీలు 4423 

  • పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్)(పురుషులు) - రూ.24280-72850    - ఖాళీలు 100 

  • పోలీస్ కానిస్టేబుల్ (టీఎస్ఎస్పీ)(పురుషులు) - రూ.24280-72850 - ఖాళీలు 5010 

  • పోలీస్ కానిస్టేబుల్ (తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) - రూ.24280-72850 - ఖాళీలు 390 

  • స్టేట్ డిజాస్టర్ రెస్ఫాన్స్ & ఫైర్ సర్వీస్ లో  ఫైర్ మెన్ - రూ.24280-72850 - ఖాళీలు 610 

  • జైలు, ఇతర సర్వీసుల్లో (వార్డర్) (పురుషులు)- రూ.24280-72850 -ఖాళీలు 136 

  • జైలు, ఇతర సర్వీసుల్లో (వార్డర్) (స్త్రీలు)- రూ.24280-72850 - ఖాళీలు 10 


 ఫీజు వివరాలు 



  • స్థానిక ఓసీ, బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 800 

  • స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు -రూ.400 

  • ఇతర అభ్యర్థులు - రూ. 800 


ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ 


587 ఎస్సై ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సై నోటిఫికేషన్ లో  414 సివిల్‌ ఎస్‌ఐలు, 66 ఏఆర్‌ఎస్‌ఐ, 5 రిజర్వ్‌ ఎస్‌ఐ, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ, 12 ఎస్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, 8 డిప్యూటీ జైలర్‌ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 


ఫీజు వివరాలు 



  • స్థానిక ఓసీ, బీసీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు - రూ. 1000 

  • స్థానిక ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు - రూ. 500 

  • ఇతరులు - రూ. 1000