World Oldest Person Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత- వయసెంతంటే?

జపాన్‌కు చెందిన 119 ఏళ్ల బామ్మ కన్నుమూశారు. ప్రపంచంలో జీవించి ఉన్న అతిపెద్ద వయస్కురాలిగా ఆమె గిన్నిస్ రికార్డు సాధించారు.

Continues below advertisement

ప్రపంచలోనే అత్యంత వృద్ధురాలు కేన్ టనాకా (119) కన్నుమూశారు. జపాన్‌కు చెందిన ఈ బామ్మ పేరు మీద గిన్నిస్ రికార్డు ఉంది. జపాన్ దేశస్థురాలైన కేన్ టనాకా ఇప్పటివరకు జీవించి ఉన్న మహిళల్లో ఎక్కువ వయసున్న వ్యక్తిగా రెండేళ్ల క్రితమే రికార్డుల్లోకెక్కారు. జనవరి 2న ఆమె తన 119వ పుట్టినరోజు జరుపుకున్నారు. 

Continues below advertisement

రికార్డ్

కేన్ టనాకా 1903 సంవత్సరంలో జన్మించారు. 19 ఏళ్ల వయసులో ఒక బియ్యం షాపు ఓనర్‌ని వివాహం చేసుకొని 103 ఏళ్ల వయసు వరకు తన భర్త వ్యాపారాన్ని చూసుకున్నారు. తర్వాత ఆరోగ్య క్షీణించడంతో ఒక నర్సింగ్ హోంలో ఉంటున్నారు.

టనాకా ఆ వయసులో కూడా పుస్తుకాలు చదువుతూ చలాకీగా మాట్లాడగలగడం విశేషం. ప్రపంచంలోని రెండు ప్రపంచ యుద్ధాలు, 1918 స్పానిష్ ఫ్లూ చూసి జీవించి ఉన్న వ్యక్తులలో ఆమె ఒకరు.

టనాకా 119వ పుట్టినరోజు నాడు ఆమెకు కోకా కోలా కంపెనీ వారు రెండు ప్రత్యేక కూల్ డ్రింక్ బాటిల్స్‌ని బహుమతిగా ఇచ్చారు. ఆ బాటిల్స్‌పై టనాకా పేరు, వయసు ఉండడం విశేషం. పుట్టినరోజు జరుపుకున్న రెండు నెలలకే ఆమె కన్నుమూశారు.

Also Read: Prashant Kishor: పీకే ఆఫర్‌పై కాంగ్రెస్ ఫైనల్ డెసిషన్ ఏంటి? ఏ బాధ్యతలు ఇస్తారు?

Also Read: Covid Update: దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి- ఒక్కరోజులో 30 మంది మృతి

Continues below advertisement