Trending
Covid Update: దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి- ఒక్కరోజులో 30 మంది మృతి
Covid Update: దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. 30 మంది కరోనాతో మృతి చెందారు.
Covid Update: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 16,522గా ఉంది. పాజిటివిటీ రేటు 0.84%గా ఉంది.
ఒక్కరోజులో 30 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5,22,223కు పెరిగింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.04గా ఉంది. రికవరీ రేటు 98.75గా ఉంది.
వ్యాక్సినేషన్
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. ఆదివారం 3,64,210 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,71,95,781కి చేరింది.
కరోనా ఫోర్త్ వేవ్
కరోనా ఫోర్త్ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగదల కారణంగా కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. వైరస్ నిర్ధరణ పరీక్షలు పెంచడం, ట్రాక్ చేయడం, చికిత్స, వ్యాక్సినేషన్, కట్టడి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు.
Also Read: Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విజయం - వరుసగా రెండోసారి