Emmanuel Macron gets reelected as French President, defeats Marine Le Pen again: ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (44) ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. వరుసగా రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ గెలిచారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్న సమయంలో జరిగిన ఎన్నికల్లో మెక్రాన్ విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారులు ఎన్నికల ఫలితాలపై ప్రకటన చేయకముందే ఆయన ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌ తన ఓటమిని అంగీకరించారు. 


మూడో అధ్యక్షుడిగా మెక్రాన్..
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన మూడో నేతగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నిలిచారు. తొలిసారిగా 2017లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మరీన్ లీ పెన్‌ను ఓడించారు మెక్రాన్. అప్పుడు కేవలం 39 ఏళ్ల వయసులో అతి పిన్న వయసు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. తాజాగా మరోసారి విజయంతో రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు అయ్యారు. అధికారులు 97 శాతం ఓట్లు కౌంట్ చేయగా, అందులో 57.6 శాతం ఓట్లు మెక్రాన్‌‌కు పోలయ్యాయి.






రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మెక్రాన్ మాట్లాడుతూ.. దేశంలో చాలా మంది తనకు ఓటువేశారని, అయితే అందరూ తనకు మద్దతు తెలపడం వల్ల గెలవలేదన్నారు. మరీన్ లీ పెన్ అతివాద ఆలోచనలు, ఆమె విధానాలకు సైతం వ్యతిరేకంగా పడిన ఓట్లతో తాను విజయం సాధించానని చెప్పారు. వారి నిర్ణయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్వాగతించారు. ఫ్రాన్స్ ప్రజలను ఇక్కడి నుంచి విదేశాలకు పారిపోయే పరిస్థితులు రాకుండా చూసుకుంటానని మాటిచ్చారు. ఆయన ప్రత్యర్థి లీ పెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను దేశం నుంచి పారిపోయే వ్యక్తిని కాదని చేసిన వ్యాఖ్యలకు సైతం తిప్పికొట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమైతే ఈరోజు తాను మరోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు అయ్యేవాడిని కాదన్నారు.






Also Read: Nellore Boy MLC in Australia: ఏపీ విద్యార్ధికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం, అతిపిన్న వయసులో MLCగా ఎన్నిక - త్వరలో మంత్రిగానూ ! 


మెక్రాన్‌కు అభినందల వెల్లువ.. 
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు యూకే ప్రధాని బొరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెనియా అధ్యక్షుడు జెలెన్ స్కీ అభినందనలు తెలిపారు. మనం భవిష్యత్తులోనూ ఇలాగే కలిసి పనిచేద్దామని జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. తమకు సన్నిహిత దేశాలలో ఫ్రాన్స్ ఒకటని, మైత్రిని ఇలా కొనసాగిద్దామంటూ బొరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు.






Also Read: Imran khan praises India's foreign policy: 'చైనాతో దోస్తీనే నా కొంప ముంచింది- కానీ భారత్ అలా కాదు'