చైనాతో దోస్తీ కారణంగానే తన పదవి పోయిందని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూశానని, అయితే స్వదేశ ప్రయోజనాలు గిట్టని ప్రతిపక్షాలు తనను పదవి నుంచి దింపేందుకు కుట్ర పన్నాయని ఇమ్రాన్ అన్నారు.
ఇదేంటి ఇలా
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చైనాతో సన్నిహితంగా ఉన్న ఇమ్రాన్ ఒక్కసారిగా తన పదవి కోల్పోవడానికి డ్రాగన్ దేశమే కారణమని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ఇదే సమయంలో భారత విదేశాంగ విధానాలపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.
పాక్ అలా కాదు
అయితే పాక్ విదేశాంగ విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చైనాతో స్నేహాన్ని తన రాజకీయ ప్రత్యర్థులు ఇష్టపడ లేదన్నారు. అప్పుడే కుట్ర మొదలైందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.
రష్యా పర్యటన
ఇక ప్రధాని హోదాలో తాను రష్యా పర్యటన చేయడం విదేశీ శక్తులకు నచ్చలేదన్న ఇమ్రాన్ ఖాన్.. ఆ పర్యటనను సమర్థించుకున్నారు. తాను రష్యాకు వెళ్లింది 30 శాతం డిస్కౌంట్‌తో చమురు కొనుగోలుకేనని, పాక్ ద్రవ్యోల్బణం నియంత్రణకే తాను ప్రయత్నించానన్నారు.
Also Read: Karnataka: యువకుడ్ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే- ఎందుకో తెలుసా?