Cyberabad Traffic Police Awareness: ట్రాఫిక్ నిబంధనలపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) వాహనదారులకు ఎప్పటికప్పుడు వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటారు. రాష్ట్రంతో పాటు దేశంలో జరిగిన చిన్న చిన్న ఘటనలను ఉదాహరణగా తీసుకుంటూ ట్విట్టర్ ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తుంటారు. తాజాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' సినిమాలోని బుజ్జి వాహనం ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్రేజ్‌తో సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు డిఫరెంట్‌గా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సినిమాలోని బుజ్జి వాహనం తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సెటైరికల్‌ ట్వీట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న బుజ్జి వాహనం ఫోటో షేర్ చేస్తూ.. 'బుజ్జికార్ రెండు లేన్స్‌లో వెళ్తుంది అంటే 2898 ADలో కూడా లేన్ డిసిప్లిన్ పాటించడం లేదా?' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. 'రేపటి కోసం లేన్ డిసిప్లిన్ పాటించండి' అంటూ వాహనదారులకు సూచిస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 






Also Read: Hyderabad Tourists: ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు - బండరాళ్లు ఢీకొని హైదరాబాద్ పర్యాటకులు మృతి