సైబరాబాద్ పోలీసులు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌తో పాటు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. తాము నిర్వహించే 3వ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లకు లఘు చిత్రాలను ఆహ్వానిస్తున్నట్లుగా వారు ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ లఘు చిత్రాల థీమ్ ఏంటంటే.. ‘‘మనం-రోడ్డు భద్రత’’. స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్ ఈ పోటీలో భాగస్వామిగా ఉంది. 


ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలో ఎంపికైన వారికి బహుమతులు కూడా ఇవ్వనున్నారు. తొలి మూడు ఉత్తమ లఘు చిత్రాలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించనున్నారు. ఈ పోటీలో తొలి ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఎంపికైతే రూ.50 వేల నగదు బహుమతి ఇవ్వనున్నారు. రెండో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌కు రూ.30 వేలు, మూడో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌కు రూ.20 వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. అయితే, ఈ లఘు చిత్రాలను రూపొందించేందుకు లేదా పోటీలో పాల్గొనేవారికి నిర్వహకులు కొన్ని సూత్రాలు, మార్గదర్శకాలు నిర్దేశించారు.


Also Read: Nalgonda: పూడ్చిన శవాన్ని తవ్వి తీసి పడేశారు.. రోడ్డుపై శవపేటిక, నల్గొండలో అమానవీయ ఘటన


లఘు చిత్రం తీసేవారికి మార్గదర్శకాలు ఇవీ..
నిర్వహకులు నిర్దేశించిన థీమ్ ‘‘మనం-రోడ్డు భద్రత’’తో మాత్రమే షార్ట్ ఫిల్మ్‌లు తీయాలి. ఆ షార్ట్ ఫిల్మ్ నిడివి 60 నుంచి 120 సెకండ్లకు ( నిమిషం నుంచి రెండు నిమిషాల నిడివి) మించకూడదు. షార్ట్ ఫిల్మ్ ప్రారంభానికి ముందు లేదా తర్వాత వేసే క్రెడిట్ లైన్లు, టెక్నీషియన్ల పేర్లు వంటి వాటి నిడివి కలిపి ఆ సమయానికి మించకూడదు. షార్ట్ ఫిల్మ్‌లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లోనే ఉండాలి. ఏ భాషలో లఘు చిత్రం తీసినా దానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండాల్సి ఉంటుంది. 


లఘు చిత్రం తీశాక ఈ పోటీకి పంపాలంటే మొత్తం వీడియోను కంప్రెస్డ్ మోడ్‌లోనే పంపాలి. ఒకవేళ ఆ షార్ట్ ఫిల్మ్ బహుమతి కనుక గెలిస్తే దానికి సంబంధించిన ఒరిజినల్ క్వాలిటీ వీడియోను ఇవ్వాల్సి ఉంటుంది. అది కనీసం 1920x1080 రేషియోలో ఉండాలి. లఘుచిత్రాల పోటీలో ఎంట్రీలకు ఆఖరు తేదీ ఆగస్టు 31. 


ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలో పాల్గొనాలనుకొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను కేశవ్ బండారి అనే వ్యక్తిని 9177283831 అనే నెంబరులో సంప్రదించవచ్చు. లేదా trfcord@scsc.in కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చు.


Also Read: Prakasam: కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. 20 లక్షలు ఇవ్వాలని భార్యకు ఫోన్‌...