ట్రెడ్ మిల్ అంటే ఆషామాషీ కాదు. చెక్కలతో చేసిన ట్రెడ్ మిల్స్ అసలు ఉండవు. ఉండవు అనే కంటే ఇప్పటి వరకూ ఎవరూ అలాంటి ఆలోచన చేయలేదనుకోవచ్చు. అలాంటి ప్రయత్నం చేసి ఓ వ్యక్తి వైరల్ అయ్యారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్‌మిల్ తయారు చేసిన విధానం.. అందరినీ ఆకట్టుకుంటోంది. విద్యుత్, బ్యాటరీలతో పనిలేకుండా అతడు రూపొందించిన ట్రెడ్‌మిల్.. ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కొన్ని బేరింగులు, మరికొన్ని చెక్కలతో ఓ వ్యక్తి ట్రెడ్‌మిల్ తయారు చేశారు.
కాలువలో కారు కేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు - తోసేసింది వారిద్దరే, ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు !
ముందుగా ఏర్పాటు చేసుకున్న చెక్క స్టాండ్లలో.. ఒక స్టాండ్‌కు కొన్ని బేరింగులను, మరో స్టాండ్‌కు వాటికి అమరే విధంగా ఇనుప రింగ్‌లను అమర్చాడు. మరోవైపు అప్పటికే గొలుసు తరహాలో తయారు చేసి పెట్టుకున్న చెక్క పలకలను వాటిపై బిగించాడు. దానిపై మనిషి నిలబండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాడు. అంతే ట్రెడ్‌మిల్ రెడీ అయిపోయింది. పనితీరు కూడా ఎలక్ట్రానిక్ ట్రెడ్‌మిల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. నడుస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా రోల్ అవుతూ ఉంటుంది.
మంత్రులు, స్పీకర్‌తో ఎమర్జెన్సీ మీటింగ్ - కేసీఆర్ మార్క్ నిర్ణయం తీసుకోబోతున్నారా ?
మార్కెట్‌లో దొరికే ట్రెడ్‌మిల్ యంత్రాల వినియోగం.. ఖర్చుతో కూడుకోవడంతో పాటూ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ వ్యక్తి తయారు చేసిన ట్రెడ్‌మిల్.. మనిషి నడకను అనుసరించి చెక్క బెల్టు తిరుగుతూ ఉంటుంది కాబట్టి, ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశమే లేదు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.
ఈ వీడియో తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఇలాంటి వినూత్నమైన ఆలోచలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన టీవర్క్స్ టీమ్‌కు ట్విట్టర్ ద్వారా రిఫర్ చేశారు కేటీఆర్. ఆయన ఎవరో కనుక్కుని ... అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. అయితే ఆచెక్కతో ట్రెడ్‌మిల ్తయారు చేసిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియకపోయినా అనేక మంది నెటిజన్లు తమకు ఇలాంటి ట్రెడ్ మిల్ ఒకటి కావాలని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ఆయన ఆవిష్కరణ సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.