సూర్యాపేటకు చెందిన దివంగత ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబును మహావీర్ చక్ర అవార్డు వరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ పురస్కారాన్ని సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. గత సంవత్సరం భారత్‌ - చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సంతోష్‌ బాబు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.


మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో పరమవీర చక్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహావీర చక్ర పురస్కారాన్ని సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తల్లి, భార్యకు అందజేశారు.










సంతోష్ బాబు భార్య సంతోషి యాదాద్రి జిల్లాలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో ఉన్న సంగతి తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆయన భార్య సంతోషికి కీలక పోస్టింగ్ ఇచ్చింది. 2020 జూన్ 21న తెలంగాణ ప్రభుత్వం సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణ పొందాక.. యాదాద్రి భువనగరి జిల్లాకు డిప్యూటీ కలెక్టర్‌గా ఆమెను కేటాయించారు. జనవరి 2021 నుంచి 2024 వరకు ఇదే జిల్లాలో కలెక్టర్‌తో పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి శిక్షణ పొందనున్నారు.


Also Read: Nizamabad: కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్.. కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరం, కారణం ఏంటంటే..


Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్




 



Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి  


Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి