పెద్ద పెద్ద బిల్డింగులు, హైఫై ఏర్పాట్లు... పైవ్ స్టార్ రేంజ్ లో ఉండాలి మరి. ఇక ఆ హోటల్ పేరు మాత్రం.. గ్రాండ్ గా ఉండాలి. ఇలా అనుకుంటూ వెళ్తాం. కానీ లోపల చేసే వంట.. తీసుకొచ్చే ఫుడ్ లో ఏముందో మాత్రం అస్సలు పట్టించుకోం. పైపైన చూడగానే ఆహా అనిపిస్తే.. చాలు.. లొట్టలేసుకుంటూ తింటాం. అందులో ఏం వస్తుంది.. చికెన్, మటన్ ఎప్పటిది అని ఏ మాత్రం పట్టించుకోం. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? నిర్మల్ మున్సిపల్ సిబ్బందికే.. వేడి వేడి బిర్యానీ ఆర్డర్ చేస్తే.. బొద్దింకలు వచ్చాయి కాబట్టి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..
నిర్మల్ మున్సిపల్ కమిషనర్, సిబ్బంది కలిసి.. లంచ్ చేసేందుకు స్థానికంగా ఉన్న ఓ హోటల్ కు వెళ్లారు. హోటల్ మామూలుగా లేదు. చాలా గ్రాండ్.. రిచ్ లుక్ తో ఉంది. సరే వెయిటర్ వచ్చాడు. నాలుగు పేట్ల బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. బిర్యానీ వేడివేడిగా వచ్చింది. వాటిని తింటుంటే.. ముందుగా ఒకరికి పురుగు వచ్చింది. అనుకోకుండా పడిందేమోననుకున్నారు. కాసేపయ్యాక మరో ఇద్దరికీ అలాగే జరిగింది. ఏదో తేడా ఉందే అనుకున్న మున్సిపల్ కమిషనర్ వెంటనే కిచెన్ లోకి వెళ్లారు. ఫ్రిజ్ ని పరిశీలించారు. ఎప్పుడో నిల్వ చేసిన నాన్ వెజ్ ను చూసి షాక్ తిన్నారు. ఓ వైపు కుళ్లిన చెకెన్, మటన్, ఎప్పటివో లెగ్ పీసులు నిల్వ ఉన్నాయి.
పేరుకే పెద్ద హోటల్.. లోపల్ కిచెన్ మాత్రం దారుణంగా ఉంది. కిచెన్ రూమ్ మధ్యలో నుంచే ఓపెన్ డ్రెయినేజీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వండిన బిర్యానీని దానిపైనే పెట్టారు. కిచెన్ అంతా చెత్తచెత్తగానే ఉంది. ఎక్కడి చెత్త అక్కడే అన్నమాట. అధికారులు పరిశీలించిన సమయంలో ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో చూస్తే.. ఫ్రిజ్ లో పెట్టిన నాన్ వెజ్.. చూస్తే.. ఎప్పుడో వారం క్రితం పెట్టినట్లు ఉంది. అదే కట్ చేసి.. కస్టమర్లకు పెడుతున్నారు. చాలా హోటళ్లలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని.. స్థానికులు అంటున్నారు. కల్తీ నూనె, కుళ్లిన పదార్థలు ఇవే... హోటళ్ల తంతు.
తమకే ఇలాంటి భోజనం పెడుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని మున్సిపల్ సిబ్బంది అంటున్నారు. హోటల్ మీద కేసు నమోదు చేసి... కిచెన్ ను సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యానికి జరిమానా విధించారు.