Coca Cola Company: తెలంగాణలో పెట్టుబడుల పెట్టేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. కొందరు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు వస్తుండగా... ఇప్పటికే పెట్టిన వారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కోకా కోలా సంస్థ రాష్ట్రంలో తమ పెట్టుబడులను మరింత పెంచుకోవాలని చూస్తోంది. సిద్దిపేటలోని ప్లాంట్ ను మరింత విస్తరించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ లో అదనంగా రూ.647 కోట్లను పెట్టుబడిగా పెట్టబోతోంది. వరంగల్ లేదా కరీంనగర్ లో రెండో తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కోకా కోలా కంపెనీ తెలంగాణలో రూ.2500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 






ఇటీవలే 400 మిలియన్ల పెట్టుబడికి సిద్దమైన ఫాక్స్ కాన్ సంస్థ


గతంలో 150 మిలియన్లు డాలర్లు పెట్టుబడి పెట్టిన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ మరో 400 మిలియన్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఫాక్స్‌కాన్‌ భారత ప్రతినిధి వి లీ సామజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ సంస్థ తెలంగాణలో మొత్తం 550 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఫాక్స్‌కాన్‌ నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొడైవర్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో తమకు ఉన్న దృఢమైన బంధానికి పెట్టుబడులే నిదర్శమని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇరువురి మధ్య పరస్పర అవగాహన కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోందన్నారు. తెలంగాణ స్పీడ్‌కు ఇది మరో నిదర్శమని కేటీఆర్‌ పేర్కొన్నారు.







ఇప్పటికే రూ.1,655 కోట్ల పెట్టుబడులు


రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్స్‌ మానుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఈ ఏడాది మే15నలో శంకుస్థాపన జరిగింది.  ఫాక్స్‌కాన్‌ పెట్టుబడి ద్వారా 25,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశారు.