CM Revanth has decided to issue new job notifications only after completing the SC classification :  ఉద్యోగాల భర్తీ , ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.  ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని  స్పష్టం చేశారు.  సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని  సూచించారు.  ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్  రిపోర్ట్ సమర్పించాలని .. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు.  2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వన్ మెన్ కమిషన్ రిపోర్టు ఇవ్వనుంది.  24గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని  రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. 


మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం!


ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  ఎస్సీ రిజ‌ర్వేష‌న్ వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండానే ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భర్తీ చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండానే 11 వేల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయడానికి నిరసనగా ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. తాను స్వయంగా  ట్యాంక్ బండ్ అంబేద్క‌ర్ విగ్ర‌హాం వ‌ద్ద‌కు బ‌య‌ల్దేరిన మంద‌కృష్ణ మాదిగ‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేసే వ‌ర‌కు, మాదిగ‌ల వాటా తేలే వ‌ర‌కు ఎలాంటి ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాలు జ‌ర‌పొద్ద‌ని మంద‌కృష్ణ మాదిగ‌ డిమాండ్ చేశారు.  ఈ అంశం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఇక నుంచి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. 


గత ఆగస్టులో ఎస్సీ వర్గీకరణపై  సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.   కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 3, 2023న మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఢిల్లీకి పంపి, సుప్రీం కోర్టులో బలమైన వాదనల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినిపించిందని  అప్పట్లో అసెంబ్లీలో తెలిపారు.  అవసరమైతే  ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. కానీ అలాంటి ప్రయత్నం చేయకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంతో మందకృష్ణ మండిపడుతున్నారు. 


రాహుల్ వల్లే బీజేపీ గెలుపు - 2029లో జరిగేది ఇదే - ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు


ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో మార్పులు చేస్తే కోర్టు సమస్యలు వస్తాయని అందుకే.. ఆర్డినెన్స్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా ముందుగా వన్ మెన్ కమిషన్ వేసి.. గడువులోకగా నివేదిక వచ్చేలా చేసి.. ఆ తర్వాతనే నోటిఫికేషన్లు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. మందకృష్ణ ఈ విషయంలో శాంతిస్తారో లేదో చూడాల్సి ఉంది.