75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్‌ ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరులకు నివాళులు అర్పించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం ప్రసంగిస్తూ.. వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో జరుగుతున్న ప్రగతి గురించి గుర్తు చేశారు. హరిత హారం, రైతు సమస్యలు, సాగునీరు, విద్యుత్, ఐటీ ఎగుమతులు, రాష్ట్ర ఆదాయం వంటి పలు అంశాలపై కేసీఆర్ ప్రసంగించారు. గత ఏడేళ్లలో తెలంగాణలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో వివరించారు.


ఈ రైతులకు గుడ్ న్యూస్
‘‘గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 3 లక్షల మంది రైతులకు రూ.25 వేలలోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసింది. రేపటి నుంచి (ఆగస్టు 16) రాష్ట్రంలోని 6 లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది.


Also Read: Watch: జెండా ఎగరేస్తుండగా కొట్టుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు.. ఆస్పత్రి పాలైన బీజేపీ నేత


Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!


‘‘పంటలకు మరింత గిట్టుబాటు ధర లభించి, రైతులకు మేలు చేకూరాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లా మినహా ఉమ్మడి జిల్లాల పరిధిలో రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తరాలతరబడి అనేక భూ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మార్చడానికి నూతన భూపరిపాలనా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రగతి నిరోధకంగా మారిన వీఆర్వోల వ్యవస్థను తొలగించింది. మూడేళ్లపాటు కష్టపడి ధరణి పోర్టల్‌ను ఆవిష్కరించి, భూరికార్డుల నిర్వహణలో పారదర్శకతను తెచ్చింది.’’




చేనేతలకు కూడా బీమా
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, రంగులు ప్రభుత్వం అందజేస్తోంది. చేనేత కార్మికుల కుటుంబాలను మరింత ఆదుకోవడానికి రాష్ట్రంలో రైతన్నలకు అమలుచేస్తున్న రైతు బీమా తరహాలో త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేస్తాం’’ అని కేసీఆర్ ప్రకటించారు.


Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!


అదే జరిగితే దేశం కుప్పకూలుతుంది: కేసీఆర్
‘‘దేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ దళిత ప్రజలు దుర్భర పేదరికంలో బతుకుతున్నారన్నది నగ్న సత్యం. మన రాష్ట్రంలో కూడా అంతే జరుగుతోంది. దళిత జాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు.. సామాజిక వ్యత్యాసం కూడా వారిని వేధిస్తోంది. దేహంలో కొంతభాగాన్ని ఖండిస్తే ఆ దేహం కుప్పకూలినట్లే.. దేశంలోనూ ఇలాంటి ఒక పెద్ద ప్రజాసమూహాన్ని అణచివేస్తే దేశమంతా కుప్పకూలుతుందనే విషయం గ్రహించాలి. దేశంలో వీలైనంత తొందరగా అసమానతలను రూపుమాపాలి. దళితు ఎదుగుదలకు అది మొదటి సోపానం కావాలి.’’ అని కేసీఆర్ అన్నారు.


‘‘2014 తెలంగాణ ఏర్పడేనాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య కేవలం 134 మాత్రమే ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 సంవత్సరాల్లో కొత్తగా 104 స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఈ రోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 238కి చేరింది. ఈ ఏడేళ్లలో ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.’’




దళిత బంధు ద్వారా లేచి నిలబడతారు
‘‘దళితజాతి వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతుంది. అణగారిన దళితజనం ఒక్క ఉదుటున లేచి నిలబడి, స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళితబంధు ఉద్యమం. దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా నేనే దళితబంధు పథకానికి రూపకల్పన చేశా. మహాత్మా జ్యోతీరావు ఫూలే, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాశయుల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు, దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నా’’


త్వరలోనే యాదాద్రి నిర్మాణం పూర్తి
‘‘కాకతీయ కళావైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు వెనక ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉంది. తెలుగు నేలపై మొదటిసారి విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన చారిత్రిక వారసత్వ కట్టడంగా రామప్ప పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వవైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగమే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం. యాదాద్రి నిర్మాణం మహాద్భుతంగా ఉందని, చరిత్రలో నిలిచిపోతుందని ప్రముఖులందరూ అంటున్నారు. అతి త్వరలోనే ఈ పునర్నిర్మాణం పూర్తవుతుంది.


Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!