BRS Party News: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు తెలంగాణలో సంబరాల మధ్య జరిగాయి. నేడు (డిసెంబరు 9) మధ్యాహ్నం 1.20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్పు పత్రాలపై సంతకం చేశారు. ఆ పత్రాలను ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ సంబంధిత అంగీకార పత్రాలపై సంతకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ భవన్ లో జరిగిన ఈ వేడుకలకు కర్ణాటక నేత, జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.