White House official:


మిత్ర దేశం కాదు..అంతకు మించి..


అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక బంధం ఇప్పటిది కాదు. దాదాపు 20 ఏళ్లు మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి. పదేళ్లుగా ఈ బంధం మరింత బలపడింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్..భారత ప్రధాని మోడీతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. బైడెన్ అధ్యక్షుడు అయ్యాక కూడా ఆ మైత్రి అలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే...వైట్‌హౌజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "భారత్ కేవలం మాకు మిత్ర దేశమే కాదు. త్వరలోనే 
సూపర్ పవర్‌గా ఎదిగే దేశంగా అవతరిస్తుంది. ఆ శక్తి సామర్థ్యాలున్నాయి" అని వ్యాఖ్యానించింది. వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా భారత్, అమెరికా మధ్య మైత్రి బలపడుతూ వస్తోందని అన్నారు. Aspen Security Forum మీటింగ్‌లో భాగంగా...వైట్ హౌజ్ ఏసియా అఫైర్స్ కో ఆర్డినేటర్ క్యాంప్‌బెల్ మాట్లాడారు. ఈ అత్యాధునిక 21 శతాబ్దంలో  భారత్, అమెరికా మధ్య మైత్రి కొనసాగడం అత్యంత 
కీలకమని చెప్పారు. "20 ఏళ్లల మరే రెండు దేశాల మధ్య లేనంత సాన్నిహిత్యం అమెరికా, భారత్ మధ్య ఏర్పడింది. ఇవి క్రమంగా బల పడుతున్నాయి" అని వెల్లడించారు. ఈ సందర్భంలోనే భారత్ సూపర్‌ పవర్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "అమెరికా చేయాల్సింది ఇంకెంతో ఉంది. టెక్నాలజీలు అందిపుచ్చుకునే విషయంలో ఇరు దేశాల మధ్య ఇంకా సమన్వయం అవసరం. భారత్ అమెరికాకు ఓ మిత్ర దేశంగానే మిగిలిపోదు. స్వతంత్ర దేశంగా, శక్తిమంతమైన దేశంగా అవతరిస్తుంది. మరో సూపర్ పవర్‌గా ఎదుగుతుంది" అని ధీమాగా చెప్పారు. ఏయే రంగాల్లో కలిసి పని చేయొచ్చనే విషయంపై ఇంకా మేథోమధనం సాగుతోందని,అందుకు అనుగుణంగానే కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా...అంతరిక్ష, విద్యా,టెక్నాలజీ రంగాల్లో సమష్టిగా పని చేయాల్సిన అవసరముంది. కేవలం చైనాను దృష్టిలో పెట్టుకుని మాత్రమే...భారత్, అమెరికా దగ్గరవుతున్నాయన్నది కేవలం అపోహేనని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య అవసరాన్ని గుర్తించామని చెప్పారు. 


మోడీకి మద్దతు..


అమెరికాకు చెందిన సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ జనెట్ యెల్లెన్ ఉక్రెయిన్ విషయంలో మోడీ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. "ఇది యుద్ధాలు చేసుకోవాల్సిన కాలం కాదని భారత ప్రధాని మోడీ చెప్పిన మాటలు అక్షరాలా సత్యం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు" అని అన్నారు యెల్లెన్. "లక్షలాది మంది పేదరికంలో కూరుకుపోతున్నారు. ఇలాంటి కష్టకాలాలు మనకు పరీక్ష పెడుతుంటాయి. ఇలాంటి సవాళ్లు ఎదురైన ప్రతిసారి భారత్, అమెరికా మధ్య మైత్రి ఇంకా బలపడుతోంది" అని వెల్లడించారు. అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించేందుకు భారత్‌కు వచ్చారు యెల్లెన్. ఈ సందర్భంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నోయిడాలోని Microsoft India Development Centre బిజినెస్ లీడర్స్‌ను కలిశారు. "ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. కాలానికి అనుగుణంగా భారత్, అమెరికా మధ్య మైత్రి బలపడుతోంది. సప్లై చెయిన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సమష్టిగా పని చేయాల్సిన అవసరముంది" అని జనెట్ యెల్లెన్ అభిప్రాయపడ్డారు.


Also Read: Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!