జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహి రంగుపై దుమారు ఇంకా కొనసాగుతోంది. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు. లేస్తూ లేస్తూనే... వైసీపీపై సెటైర్లతో పవన్ విరుచుకుపడ్డారు. వారహీ వాహనంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదట తన సినిమాలు ఆపారని.. తర్వాత తను విశాఖ పర్యటకు వస్తే హోటల్ రూమ్ నుంచి బయటకు వెళ్లనియ్యలేదని ఇప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయాలా అంటూ ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే..."మొదట మీరు నా సినిమాలను ఆపేశారు; విశాఖపట్నంలో నన్ను వాహనం, హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు. సిటీ వదిలి పెట్టి వెళ్లిపోవాలని బలవంతం చేశారు. మంగళగిరిలో మీరు నా కారుని బయటకు వెళ్లనివ్వలేదు. తర్వాత నన్ను నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు మీకు సమస్యగా మారింది. సరే, తర్వాత నేను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయాలా?? అంటూ ట్వీట్ చేశారు.
వారాహీ వెహికల్ కలర్ ఆలివ్‌గ్రీన్ కలర్ షర్ట్‌ను పోస్ట్ చేసింది... వైసీపీ ఇదైనా సరే నేను వేసుకోవచ్చా అంటూ క్వశ్చన్ చేశారు.
వైసీపీ నేతల విమర్శలకు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా రాత్రి కౌంటర్ ఇచ్చారు. పవన్ వెహికల్ కు ఏ రంగు వాడలో మాకు తెలియదా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలా రంగుల విషయంలో హై కోర్టుతో మొట్టికాయలు తినే అలవాటు మాకు లేదన్నారు. మైకుల ముందు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం తప్ప వైసీపీ నేతలకు ఏంతెలుసని మండిపడ్డారు. ప్రచార రథం సిద్ధమైందని పవన్ ప్రకటించగానే విమర్శలు చేయడానికి మైకుల ముందు సిద్ధమయ్యామని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ ప్రతి విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటుందన్నారు. పవన్ ప్రచార వాహనం రంగుపై వైసీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖపట్నంలో పార్టీ ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో లెక్కకు మించి మొట్టికాయలు తిన్న వారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడటం, నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోందన్నారు. నిబంధనలు పరిశీలించకుండా, ఏ రంగు వేశారో చూడకుండా రవాణా శాఖ వారు అనుమతి ఎలా ఇస్తారన్నారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం వైసీపీ నాయకుల బుద్ధిరాహిత్యాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయన్నారు.