BRS Leader KTR Visits Sangareddy Jail | సంగారెడ్డి: రేవంత్ రెడ్డి సీఎం పదవి ఐదేళ్లేనని గుర్తుంచుకోవాలని, ఆయనకు దమ్ముంటే తమతో కోట్లాడాలని, రాజకీయంగా తలపడాలి కానీ పేదలు, రైతులకు మాత్రం నష్టం కలిగొంచవద్దని కేటీఆర్ (KTR) హెచ్చరించారు. సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో ఉన్న లగచర్ల బాధితులను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాడు పరామర్శించారు. వారితో ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తమ వద్ద నుంచి భూములు లాక్కోవద్దని నిరసన తెలిపిన లగచర్ల రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఎత్తివేసి, వారిని జైళ్ల నుంచి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


కలెక్టర్‌పై పిల్లలు హత్యాయత్నం చేశారా ?


30, 40 కిలోల బ‌రువు కూడా లేని పిల్ల‌లు అధికారులపై హ‌త్యాయ‌త్నం చేశార‌ంటూ కేసులు పెట్ట‌డానికి రేవంత్ రెడ్డికి మ‌న‌సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి రాబందులా మారారని కేటీఆర్‌ విమర్శించారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ పెడితే తన కుటుంబసభ్యుల కోసం మార్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే మొదట తిరుగుబాటు మొదలైందని, సంగారెడ్డి జిల్లా న్యాల‌క‌ల్‌లో కూడా రైతులు పోరాటం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు.




రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు


సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఫోన్‌లో ఆయన ఇచ్చే ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఫార్మా సిటీ కోసం వేల ఎకరాలు కావాలని రేవంత్ సర్కార్ చెబుతోంది. తమ భూములు తీసుకోవద్దని చెప్పినందుకు వారిపై అక్రమ కేసులు బనాయించి రైతులు, పేదల్ని వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.



Also Read: Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన 


కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం
అల్లుడి ఫార్మా కంపెనీకి కొడంగల్‌ను రాసివ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయగా ప్రజలు తిరగుబాటు చేస్తున్నారు. వారిని భయపెట్టి భూములు లాక్కునేందుకు కలెక్టర్, ఉన్నతాధికారులపై హత్యాయత్నం అంటూ రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు కొడంగల్ తలెత్తిన పరిస్థితి, రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేసులు పెడితే ఏం చేయాలో మాకు తెలుసు. కొట్టాడి రాష్ట్రాన్ని సాధించుకున్నోళ్లం. ఈ కేసులు, పోరాటాలు మనకు కొత్త కాదు. అక్రమ కేసులు పెడితే బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దు. వీటిని చట్ట పరంగా కోర్టుల్లోనే ఎదుర్కుని కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెబుతాం. రేవంత్ రెడ్డికి చేతైనేతే మాతో పోరాడాలని, పేదలు, రైతులతో పోరాడి ఇబ్బంది పెట్టడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.



Also Read: Family Survey Applications: రోడ్డు పక్కన కుప్పలుగా సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తు ఫారాలు, గతంలో ప్రజాపాలన అప్లికేషన్లు!