BRS LRS Fight :  LRS ను ప్రజలపై భారం మోపకుండా ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..  బీఆర్ఎస్ నేతలు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేసారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఒకమాట..ఇప్పుడు ప్రభుత్వంలో ఒక మాట మాట్లాడుతున్నారని ారోపించారు.  LRS ఉచితంగా అమలు చేయాలి లేదంటే ముఖ్యమంత్రి ,మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  మీరు అన్న 100 రోజులు పూర్తి కావస్తోంది..ఇక హామీలు అమలయ్యేవరకు మీ వెంట పడుతాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.


25 లక్షల మందిపై 20 వేల కోట్ల భారం 


రాష్ట్రంలోని  25 లక్షల మంది LRS లబ్దిదారులపై సుమారు 20 వేల కోట్ల భారం మోపేలా కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న LRS నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అన్ని చోట్లా ధర్నాలు  చేపట్టింది.  గతంలో ఎల్ఆర్ఎస్(LRS) వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. నాడు అడ్డగోలుగా మాట్లాడిన నేటి కాంగ్రెస్ మంత్రులు, ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళన(BRS protests) కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని నినదించారు.


కాంగ్రెస్ హామీలు అమలు చేయాల్సిందే !
 
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చింది.  మేము అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు అన్నారు ఇప్పుడు మీరు అన్న 100 రోజులు కూడా ఐపోతున్నాయి. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రజా క్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని నేతలు హెచ్చరించారు.  మూడు నెలలు అయినా రైతులకు ఇంకా రైతు బందు పడలేదు..మహాలక్ష్మి ఊసేలేదు,చేయూత పెన్షన్ మరిచిపోయారన్నారు.  అధికారం లోకి వచ్చి కాంగ్రెస్ అమలు చేసింది ఉచిత బస్సు ప్రయాణం ఒకటే. అందులోనూ ఉచిత బస్సు తో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ ను ,బి అర్ ఎస్ పార్టీని బొంద పెడుత అంటూన్న రేవంత్ రెడ్డి నీ హామీలు అమలు చేయకుంటే ప్రజలే నిన్ను బొంద పెడుతారని హెచ్చరించారు. 


ఒక్కొక్కరిపై లక్ష భారం 


ఒక్కో ఫ్లాట్‌పై లక్ష వసూలుకు ప్లాన్ చేస్తున్నారని..  LRS వల్ల 25 లక్షల మందికి నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలంటున్నారు.  గతంలో BRS ప్రభుత్వం LRS తీసుకొచ్చినప్పుడు నానా యాగీ చేసి మెమొస్తే ఉచితంగా చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజలపై సుమారు 20 వేల కోట్ల భారం వేయడానికి సిద్ధమైందని విమర్శించారు.  ఉచితంగానే LRS ను వర్తింపజేసేవరకు పోరాటం ఆపేది లేదన్నారు.  LRS ఉచితం గా అమలు చేయించుకుంటే సిఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉత్తం కుమార్ రెడ్డి,సీతక్క ,కోమటి రెడ్డి,డిప్యూటీ సి.ఎం బట్టి విక్రమార్క లు రాజీనామా చేయాలన్నారు.  కాలం ఎప్పుడు ఒకలా ఉండదు మా టైం కూడా వస్తుంది..మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి పెరు రాసిపెట్టుకుంటామని హెచ్చరించారు.