Telangana Minister Seetakka Comments | ఆదిలాబాద్: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన రమేష్ బిధూరిపై తెలంగాణ మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రియాంకా గాంధీ మీద బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలు మహిళా లోకానికే అవమానకరం, ప్రతి ఒక్కరూ బీజేపీ నేత వ్యాఖ్యల్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఓ మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.
మహిళలు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందా ?
బీజేపీ పెద్దలు ఇకనైనా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తే మహిళలు స్వేచ్చగా, నిర్బయంగా తిరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీలో మహిళా వ్యతిరేకత చాలా ఉంది. అందుకే రమేష్ బిధూరిని బీజేపీ పెద్దలు వెనకేసుకొస్తున్నారు. మహిళను అందులోనూ ప్రజాప్రతినిధి శరీరాన్ని రోడ్లతో పోల్చి తన దుర్బుద్ధి, దురుద్దేషం, పురుష దురకారాన్ని బయటపెడితే బీజేపీ మద్దతిస్తోంది. వికృత చేష్టలతో బీజేపీ ఆడవాల్లను అవమాన పరుస్తోంది. ఆ పార్టీకి మహిళలు బుద్ది చెప్పడం ఖాయం అనిపిస్తోంది. మనుధర్మ శాస్త్రాన్ని అవలంభించడమే వారి మూల సిద్ధాంతం. ఆ శాస్త్రంలో మహిళలను గౌరవించిన చరిత్ర లేదు. వారికి మహిళల్ని గౌరవించడం తెలియదు. - మంత్రి సీతక్క
ప్రియాంక గాంధీపై రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కనక గెలిపిస్తే కల్కాజీలోని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల లాగ నున్నగా మారుస్తానని చెప్పడంతో వివాదం మొదలైంది. తాను చేసింది అని భావిస్తే.. ముందుగా లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన, కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలన్నారు.ఓక వీడియోలో, రమేష్ బిధురి మాట్లాడుతూ, ‘బిహార్ రోడ్లను హేమమాలిని చెంపల్లాగ అందంగా చేస్తానని గతంలో లాలూ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్జేడీ నేత అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబితే.. తాను కూడా ప్రియాంక గాంధీకి సారీ చెబుతా అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని వారే మహిళలా, వారికే ఆత్మగౌరవం ఉంటుందా.. బీజేపీ మహిళా నేతలకు ఆత్మ గౌరవం, విలువ ఉండవా అని ఎదురు ప్రశ్నించడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు.
Also Read: KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్