Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆశ్రమం దగ్గరకు వచ్చిన రామ్మూర్తి నిజం చెప్పమని అమర్‌ను బలవంతం చేస్తాడు. ఏడుస్తూ ప్రాధేయపడతాడు. దీంతో అమర్‌ ఆశ్రమం లోపలకి వెళ్తాడు. నిజం చెప్పమంటే లోపలికి వెళ్తున్నారేంటి అంటూ రామ్మూర్తి, రాథోడ్‌ అమర్‌ వెనక వెళ్తారు. ఆరు, గుప్త కూడా వెళ్తారు. లోపలికి వెళ్లిన అమర్‌ ఆరు ఫోటోకు అడ్డుగా నిలబడి సారీ ఆరు అంటాడు. దీంతో అదేంటి గుప్తగారు ఆయన కూతురు గురించి అడిగితే మా ఆయన నాకు సారీ చెప్తున్నారేంటి అని అడుగుతుంది.


అమర్‌: మీరు కోరుకున్నట్టుగానే మీ 30 ఏళ్ల నిజం మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు నిజం తెలిశాక మీరడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇన్ని రోజులు నేను మీ దగ్గర ఎందుకు నిజం దాచానో..  మీకు ఇప్పుడు అర్థం అవుతుంది.


రామ్మూర్తి:  అది మీ భార్య ఫోటో కదా బాబు గారు అంటే…


ఆరు: ఆంటే ఆయన మా నాన్నా గుప్తగారు..


గుప్త: అవును..


నిజం తెలియగానే ఆరు ఏడుస్తుంది. రామ్మూర్తి కూలబడిపోతాడు. మరోవైపు భాగీ, అమర్‌ వాళ్ల కోసం వెతుకుతుంది. నిర్మల ఫోన్‌ చేసి అమర్‌ కనిపించారా అని అడుగుతుంది. లేదని చెప్పగానే నువ్వు ఇంటికి వచ్చేయ అని చెప్తుంది. భాగీ సరే అంటుంది. మరోవైపు రామ్మూర్తి బాధపడుతుంటాడు.


రామ్మూర్తి: బాబు గారు ఏంటండి ఇది..


అమర్‌: అవునండి నా భార్య తల్లిదండ్రులు ఎవరో కనుక్కుని తన కూతురు గురించి చెప్పి వాళ్లను ఒక్కటి చేద్దామని బయలుదేరిన నాకు ఎదురైన నిజం అండి ఇది.  నీకు ఈ నిజం ఎలా చెప్పాలో తెలియలేదు.  మీ బాధకు విముక్తి లేదు. మీ పశ్చాతాపానికి అంతం లేదు.  అందుకే మీకు నిజం చెప్పలేదు


రామ్మూర్తి: బాబు గారు ఏం చెప్తున్నారు మీరు


అమర్‌: ఇదే మీరు 30 ఏళ్లుగా ఎదురు చూసిన నిజం


అని చెప్పగానే రామ్మూర్తి ఏడుస్తూ తనను తాను తిట్టుకుంటాడు. ఇంతలో రాథోడ్‌ పంచె తీసుకురాగానే ఆ పంచెను రామ్మూర్తికి ఇస్తాడు అమర్.


 అమర్‌: మీరు ఎవరో తనకు తెలియకపోయినా.. తనను ఎందుకు వదిలేశారో తనకు అర్థం కాకపోయినా.. ఒక్కటే తను బలంగా నమ్మింది. తన తండ్రి తన కోసం వస్తాడని.. మిమ్మల్ని నమ్మిందండి.. నమ్మకం ఉన్నచోట కోపాలు ద్వేషాలు ఎందుకు ఉంటాయి.


రాథోడ్‌: మా మేడం బంగారం సార్‌ తనకు కీడు చేసిన వాళ్లకు కూడా మేలు చేసేది. అలాంటిది తనను కన్నతండ్రి సార్‌ మీరు. మీ కళ్లల్లో నీళ్లు రానిచ్చేదా..?


రామ్మూర్తి: ఇన్ని రోజులు నేను తండ్రిగా ఓడిపోయాను అనుకునే వాడిని బాబు.. కానీ నేను ఎప్పుడో చనిపోయాను బాబు


అమర్‌: మీరిలా అయిపోతారనే నేను మీకు ఈ విషయం చెప్పలేదు


రాథోడ్‌: ఆ దేవుడు దుర్మార్గుడు సార్‌ .. మేడం ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన కుటుంబాన్ని చూడకుండా చేశాడు.


అమర్‌: దేవుడు ఆ పని చేయలేకపోయాడు రాథోడ్‌. ఆరుకు ఆ దేవుడు కూడా అంత పెద్ద శిక్ష వేయలేకపోయాడు. అందుకే నా ద్వారా తండ్రీ కూతుళ్లు ఇద్దరికీ ఓకేసారి నిజం చెప్పించాడు.


అందరూ షాక్‌ అవుతారు.


రామ్మూర్తి: ఏంటి బాబు మీరు చెప్పేది నా కూతురు ఇక్కడ ఉందా..?


అని రామ్మూర్తి అడుగుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!