జనవరిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని భారతీయ జనతాపార్డీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. దీక్ష ముగింపు సందర్భంగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.  ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమంలో వందల మంది యువత బలిదానాలు చేసుకున్నారని... కానీ యువతకుఉద్యోగాలు రాలేదన్నారు.   ఎందరో మేధావులు ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే.... కేసీఆర్ లాంటి మూర్ఖుడి వలన నిరుద్యోగులు మోసపోయారని మడంిపడ్డారు.  ఆ రోజే మేధావులు కేసీఆర్ మోసాన్ని పసిగడితే... రాష్ట్రంలో  ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు బండి సంజయ్.  ఆనాడు తన మాట వినకుండా సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఎన్నో ఉద్యమాలు చేశారనే సాకుతో కక్షకట్టి యువతను హింహిస్తున్నారని ఆరోపించారు.





Also Read: రాచకొండ పరిధిలో 60 శాతం పెరిగిన సైబర్ నేరాలు... 55 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్షలు... నేరాల జాబితాను ప్రకటించిన సీపీ మహేష్ భగవత్


కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా... ఉన్న ఉద్యోగులను తొలగించిన మూర్ఖుడు సీఎం అని మండిపడ్డారు.  12 వేల మంది విద్యా వలంటీర్లు, 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 22 వేల మంది స్కావెంజర్లను తొలగించారని బండి సంజయ్ విమర్శించారు.  అసెంబ్లీలో ఈ సీఎం 1 లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయని ప్రకటించారని.. సీఎం వేసిన బిశ్వాల్ కమిటీ 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నివేదిక ఇచ్చిందన్నారు.   టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గుర్తు చేశారు.  సమగ్ర కుటుంబ సర్వేలో 8 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు లెక్క చెప్పారన్నారు.   తెలంగాణ వచ్చిన తర్వాత  600 మంది యువత ఉద్యోగాల్లేక ఆత్మహత్య చేసుకున్నారని వారేం పాపం.. చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు.  జనవరి లోపు నోటిఫికేషన్ ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని తీరుతారని ప్రకటించారు.


Also Read: జగన్ బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ - తెలంగాణ హైకోర్టులో పూర్తయిన వాదనలు !



నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.  నిరుద్యోగ యువత కలలను కల్లలుగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ని పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్షలో ఈటల ప్రసంగించారు.  వెంటనే నోటిఫికేన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కూడా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలోనూ  విఫలమైందన్నారు.   కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదని గుర్తు  చేశారు. ఖాళీగా ఉన్నలక్షా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీ ఒపెన్ చేసి ఐదు వేల ఉద్యోగాలిప్పిస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టినా టీఆర్ఎస్ హామీ నెరవేర్చలేదని ప్రశ్నించారు.


Also Read:  గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్


తెలంగాణలో నిరుద్యోగ యువత తీవ్ర అసహనంతో ఉందన్నారు బీజేపీ నేత తీన్మార్ మల్లన్న.  డిగ్రీ చదివిన వాళ్లకు ఉద్యోగాలివ్వాలా? అని ప్రభుత్వం అంటుందని..మరి ఐదో తరగతి చదువుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.  ఏడోతరగతి పరీక్ష పెడితే ఇపుడున్న ఒక్క మంత్రి పాస్ కాడని సెటైర్ వేశారు.  కేసీఆర్ ఉద్యోగం, తన కుటుంబ ఉద్యోగాలు పోతే..తప్ప నిరద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు.తెలంగాణ రాకపోతే ఇవాళ  కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చేవా ? అని ప్రశ్నించారు. ఏడేళ్ల పాలనలో ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.  


Also Read: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి