సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిరుద్యోగ దీక్ష జరగనుంది. బీజేపీ కార్యాలయం ఆవరణలో నిరుద్యోగ దీక్ష చేయనున్నట్టు సంజయ్ ప్రకటించారు. దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందని ఆపార్టీ నేతలు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది.
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు.. భర్తీ చేయాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. బండి సంజయ్ ఈ దీక్ష చేస్తున్నారు. మెుదట కమలం శ్రేణులు ఇందిరా పార్కు వద్ద దీక్షను ఏర్పాటు చేయాలని చూశారు. దీని కోసం.. అనుమతి ఇవ్వాలని పోలీసులను కూడా బీజేపీ నేతలు కోరారు. అయితే పోలీసులు వారి వినతిని తిరస్కరించారు. కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయని చెప్పారు.
ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న కారణంగా.. ఆంక్షలు విధించాలని హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. తెలంగాణలో జనవరి 2వ తేది వరకు ఆంక్షలు విధించనున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, పెద్ద ఎత్తున జనం గుమికూడడంపై ఆంక్షలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం బండి సంజయ్ చేపడుతున్న దీక్షకు..అనుమతి లేదని.. పోలీసులు చెప్పారు. దీంతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి దీక్ష వేదిక మారింది.
నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష
తెలంగామ బీజేపీ చేపడుతున్న దీక్షపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలది నిరుద్యోగ దీక్ష కాదని.. సిగ్గు లేని దీక్ష అని విమర్శించారు. బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చాక.. ఎన్నికోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను నిలువునా ముంచిందని ఆరోపించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే దీక్షను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేయాలని సవాల్ విసిరారు.
Also Read: KTR: నీకు నిబద్ధత ఉంటే ఇందిరా పార్కు సాక్షిగా ముక్కు నేలకు రాయి.. వివరణ ఇవ్వు: కేటీఆర్
Also Read: Jammalamadaka Pichaiah: తొలితరం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున పిచ్చయ్య కన్నుమూత...
Also Read: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ నిర్ధారణ