Breaking News Live Telugu Updates: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం, ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ - 2022 అవార్డు ప్రకటించింది. ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ప్రకటించారు.
Breaking News: హైదరాబాద్ - వరుస ప్రమాదాలతో నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్
హైదరాబాద్: వరుస ప్రమాదాలతో ఇండియన్ రేసింగ్ లీగ్ ను నిలిపివేశారు. రెండు ప్రమాదాలు జరగడంతో అప్రమత్తమైన నిర్వాహకులు ఇండియన్ రేసింగ్ లీగ్ ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట
వరస ప్రమాదాలతో కార్ రేసింగ్ ఆలస్యంగా జరుగుతుందని ప్రేక్షకులు భావించారు. మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఫార్ములా-4 రేస్ 2 మధ్యాహ్నం 3.30 కి ప్రారంభం అయింది. ఫార్ములా-4 రేస్ జోరుగా సాగుతుందనుకుంటే అంతలోనే మరో ప్రమాదం జరిగింది. దీంతో ఇండియన్ రేసింగ్ లీగ్ కి మరింత అలస్యం కావడంతో లీగ్ ను మధ్యలోనే నిలిపివేశారు.
కార్ రేసింగ్ లో వరసగా స్వల్ప ప్రమాదాలు
క్వాలిఫైయింగ్ రేస్ లో చెన్నై టర్బో రేసర్ కి స్వల్ప గాయాలయ్యాయి. రెండు రేసింగ్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ మర్గ్ లో జరిగిన ఈ ప్రమాదంలో చెన్నై టర్బో రైడర్స్ మహిళా రేసర్ కు స్వల్పగాయాలయ్యాయి. మహిళ రేసర్ కు స్వల్ప గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్వాలిఫైయింగ్ రేస్ లో గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
రేస్ లో ఇలాంటి చిన్న చిన్న క్రాసింగ్స్ ప్రమాదాలు సహజం అంటున్నారు నిర్వహకులు.
- వికారాబాద్ జిల్లా అనంతగిరి చివరి ఘాట్లో జైలు పల్లి రోడ్డు సమీపంలో వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా
- ఒకరు మృతి 13 మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం
- సంఘటన స్థలంలోనే చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
- క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు,
- వికారాబాద్ నుండి థరూర్ జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా
- బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఘటన..
- డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన పెను ప్రమాదం
- ఈ ఘటనలో ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం 13 మందికి గాయాలు
- నైరుతి మరియు ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- ప్రస్తుతానికి జాఫ్నా (శ్రీలంక)కి తూర్పున 600 కి.మీ.,తూర్పు ఆగ్నేయంగా కారైకాల్‌కు 630 కి.మీ., చెన్నైకి 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- నెమ్మదిగా వాయుగుండంగా కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు - దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం
- దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
- రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
- దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం
- ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం
- మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాదు
- వర్షాల నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
- డా.బి.ఆర్ అంబేద్కర్, ఎండీ , విపత్తుల సంస్థ
కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.
సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పొట్లదుర్తి గ్రామానికి చెందిన భార్య భర్తలైన సిరంగి దస్తగిరి (45), సిరంగి సరస్వతి (35) అనారోగ్యం కారణంగా వైద్యం కోసం ఆటోలో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామానికి వెళ్లారు. తిరిగి పోట్లదుర్తి గ్రామానికి వస్తుండగా ముద్దనూరు వద్దకు రాగానే తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ప్రమాదంలో దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ పట్నం ప్రేమ్ కుమార్ తీవ్ర గాయాలయ్యాయి. 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
- హుస్సేన్ సాగర్ తీరాన ప్రారంభమైన కార్ రేసింగ్
- ఫార్ములా-4 రేసింగ్ క్వాలిఫైయింగ్ రేస్ షురూ
- ఉదయం 11.10 నిమిషాలకు ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున ఇస్నాపూర్ వద్ద ఆగి ఉన్న బస్సును ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కరు దుర్మరణం చెందారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభం కానుంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని శామీర్‌పేటలో గల లియోనియా రిసార్ట్‌లో మధ్యాహ్నం 2 గంటలకు శిబిరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తదితరులు పాల్గొంటారు.
Background
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్ప పీడనంగా మారి శనివారం (నవంబరు 19) మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారి నైరుతికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఆ తరవాత 2 రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాఆంధ్ర తీరం దిశగా దాని కదలిక ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
దీని ప్రభావంతో నవంబరు 20 నుంచి 23 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తా ఆంధ్రల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈనెల 21న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లా్ల్లో, 22న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
అదేవిధంగా 20, 21వ తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, నైరుతి బంగాళాఖాతంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. చేపల వేటలో వున్న మత్స్యకారులు ఆదివారంలోగా తీరానికి చేరుకోవాలని నిర్దేశించింది. ఇక శనివారం ఏపీ, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చలి వాతావరణం కొనసాగింది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులు
Hyderabad Weather News: ‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 14 డిగ్రీల వరకూ ఏర్పడే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక శనివారం నమోదైన గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.3 డిగ్రీలు, 16.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నాయి’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించారు.
తెలంగాణలో పొడి వాతావరణమే
Telangana Weather News: ఇక తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు చాలా చోట్ల పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. కానీ, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక చలి వాతావరణం తెలంగాణలో మరింత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో కూడా అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధర (Todays Gold Rate) నేడు కాస్త తగ్గింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.500 పెరిగింది. బంగారం ధర 10 గ్రాములకు రూ.15 వరకూ ఎగబాకింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.53,020 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,500 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,500 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,600 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.53,020 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,500 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -