YS Jagan News: ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 

YS Jagan Passport News: పాస్‌పోర్టు విషయంలో జగన్ చేస్తున్న పోరాటానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు జారీ చేసిన ఆదేశాలు కొట్టేసింది.

Continues below advertisement

Jagan News: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్‌కు ఊరట లభించింది. ఆయనకు ఐదేళ్ల కాలపరిమితతో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గతంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. గత ఏడాది ఆగస్టులో జగన్మోహన్‌రెడ్డి తన కుమార్తెల పుట్టిన రోజు కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. తనకు రెగ్యులర్ పాస్‌పోర్టు ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. అంతకు ముందు ఐదేళ్ల కాలానికి పాస్‌పోర్టు ఇవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులపై ప్రజాప్రతినిధుల కోర్టు స్టే విధించింది. ఏడాది పునరుద్ధరణకే అంగీకరించింది. దీని కూడా కొన్ని షరతులు పెట్టింది. 20 వేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. ఈ ఉత్తర్వులపైనే హైకోర్టు ఆశ్రయించిన జగన్‌కు కాస్త ఊరట లభించింది. ఐదేళ్ల పాటు పాస్‌పోర్టు జారీకి వీలుగా నిరంభ్యంతర పత్రం ఇవ్వాలని ఆదేశించింది. 

Continues below advertisement

2019 నుంచి ఐదేళ్లపాటు జగన్ మోహన్ రెడ్డికి డిప్లొమేటిక్‌ పాస్‌పోర్ట్‌ ఉండేది. 2024లో పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ పాస్‌పోర్టు రద్దు అయిపోయింది. దీంతో ఆయన తన వ్యక్తిగత పాస్‌పోర్టు మీదనే విదేశాలకు వెళ్లాలి. సెప్టెంబర్‌లో విదేశాలకు వెళ్లాల్సిన ఆయన తన పాస్‌పోర్టు రెన్యువల్ చేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని చెప్పిన సీబీఐ కోర్టు ఆదేశాలను చూపించారు. అయితే 2018లో నమోదు అయిన పరువునష్టం దావా కేసు విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. ఆ కేసులో కూడా ఎన్‌వోసీ తీసుకురావాలని సూచించారు. 

2018లో విజయవాడ కోర్టులో జగన్ మోహన్ రెడ్డిపై అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ పరువు నష్టం దావా వేశారు. పాస్‌పోర్టు జారీకి ఈ కేసు అడ్డంకిగా మారింది. ఈ కేసు సంగతి తనకు తెలియదన్న జగన్ కోర్టుకు వెళ్లారు. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇది అబద్దమని పీపీ వాదించారు. ఆ కేసులో ఇచ్చిన సమన్లు అందుకోవడం లేదని, 2019, 2024లో ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో కూడా కేసు గురించి ప్రస్తావించారని తెలిపారు. ఈ కేసుపై హైకోర్టు స్టే ఇవ్వలేదని కూడా కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనలతో ఏకీ భవించిన విజయవాడ కోర్టు జగన్ పిటిషన్ కొట్టేసింది. కేవలం ఒక ఏడాది మాత్రమే రెన్యువల్ చేసుకోవడానికి అంగీకరించింది. అంతేకాకుండా 20వేల పూచీకత్తు స్వయంగా హాజరై ఇవ్వాలని కూడా ఆదేశించింది. 

Also Read: వైసీపీ గతే తెలంగాణ కాంగ్రెస్‌కు - పార్టీ ఆఫీసులపై దాడులపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడి హెచ్చరిక

Continues below advertisement