AP BJP Vice President Vishnuvardhan Reddy: తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి కలకలం రేపింది. అయితే ఈ విషయంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ భిన్నంగా స్పందించారు. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీని ఆయన గుర్తు చేశారు. ఆ పార్టీ గతే తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు.
ప్రభుత్వాలు తమ విధి మర్చిపోయి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాల్సిన పరిస్థితి వచ్చినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణలో వ్యవస్థలన్నీ కప్పకూలిపోయాయన్నదానికి భారతీయ జనతా పార్టీ ఆఫీసుపై జరిగిన మూకదాడే సాక్ష్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. శాంతిభద్రతలు తమ అధీనంలో ఉంటాయన్నారు. ఓ చిన్న రాయి ఎదుటివారిపై పడిన అది వారి అరాచకవాదమేనని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలపై ప్రభుత్వాలే ఇలాంంటి మూకదాడులను ప్రోత్సహిస్తే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుత నిరసనలు చేయవచ్చునని అయినా ఢిల్లీ రాజకీయాలకు తెలంగాణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అక్కడి ఎన్నికల్లో రాజకీయ నేతలు విమర్శలు చేసుకుంటే తెలంగాణ ఆఫీసుపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలోనే హోంమంత్రిత్వ శాఖ కూడా ఉంది. ఆయనే ఈ దాడికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తక్షణం నిందితుల్ని అరెస్టు చేసి భారతీయ జనతా పార్టీకి భేషరతు క్షమాపణ చెప్పకపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనే ఈ దాడులకు వ్యూహరచన చేశారని అనుకోవాలి. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా తీసుకుంటే అంత కంటే తీవ్రమైన పొరపాటు ఉండదని హెచ్చరించారు.
గతంలో ఏపీలో ఇలా ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన పార్టీకి ప్రజలు ఏ గతి పట్టించారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నారు. తక్షణం ఈ ఘటనను ఖండించి .. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టి వెంటనే జైళ్లకు పంపాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎదురుదాడులకు సిద్దపడుతుదంని హెచ్చరించారు. ఈ ఘటనను పలువురు బీజేపీ నేతుల తీవ్రంగా ఖండించారు.