Breaking News Live Telugu Updates: అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు కేసీఆర్ అధిరిపోయే గిఫ్ట్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 01 Jun 2022 05:01 PM
అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు కేసీఆర్ అధిరిపోయే గిఫ్ట్

ఆంతర్జాతీయ స్థాయిలో రాణించిన తెలంగాణ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. నిఖత్ జరీన్‌, ఈషా సింగ్‌కు రెండు కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.

Lawyer Attacks SI: బాధితురాలికి న్యాయం చేస్తున్న పెనుగొండ ఎస్‌ఐపై లాయర్ దాడి, ఉద్రిక్తత

పశ్చిమగోదావరి: ఎస్ఐ పై లాయర్ దాడి చేశారు. ప.గో. జిల్లా పెనుగొండ మండలం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర స్థాయి లో ధర్నా జరిగింది. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు..  అమ్మాయికి న్యాయం చేసే ప్రక్రియలో ఉన్న ఎస్ఐ మోహన్ రావుపై , ప్రియుడి వెంట వచ్చిన లాయర్ దాడికి దిగారు. పెనుగొండ SI మోహన్ రావుపై వాగ్వాదానికి దిగి చెయ్యి చేసుకున్న అడ్వకేట్ పస్తుల సింహచలం భీమవరం బార్ అసోసియేషన్  వైస్ ప్రెసిడెంట్. ఎస్ఐ మోహన్ రావు కాలర్ పట్టుకుని వాగ్వాదానికి దిగి దాడి చేసిన లాయర్ ని వెంటనే శిక్షించాలని అమ్మాయి తరఫు బంధువులు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.

Mallu Bhatti Vikramarka: రేవంత్ రెడ్డి రాకపోవడంలో ఎలాంటి వివాదం లేదు: భట్టి విక్రమార్క

తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని అంశాలను పొందుపర్చి ఏఐసీసీ కి నివేదిస్తామని భట్టి విక్రమార్క(సీఎల్పీ నేత) అన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై రెండురోజులపాటు ఈ చింతన్ శిబిర్ లో చర్చిస్తామని, చింతన్ శిబిర్ లో 6అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ఈ 6అంశాలలో రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలు ప్రతిబింబిస్తాయి. చింతన్ శిబిరంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకి రోడ్ మ్యాప్ తయారుచేస్తామని చెప్పారు. జిల్లాల వారిగా కూడా చింతన్ శిబిర్ నిర్వహిస్తాం. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ని జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ సమావేశాలు. ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ఉండడం వల్లనే పీసీసీ చీఫ్ హాజరు కాలేదు. రేవంత్ రెడ్డి రాకపోవడంలో ఎలాంటి వివాదం లేదు

Mallu Bhatti Vikramarka: తెలంగాణ కాంగ్రెస్ మేథో మథన శిబిర్ సమావేశాలు ప్రారంభం

ఏఐసీసీ ఆదేశాల మేరకు నేడు కీసరలో రెండు రోజుల పాటు జరిగే నవ సంకల్ప్ మేథో మథన శిబిర్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా పతాకవిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు. నవ సంకల్ప్ చింతన్ శిబిర్ చైర్మన్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడారు. ఈ సమావేశం తెలంగాణలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ శిబిరానికి  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మానిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, శ్రీనివాస కృష్ణన్ టీపీసీసీ ముఖ్య నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Nizamabad Rains: నిజామాబాద్‌లో గాలివాన బీభత్సం, తడిసిపోయిన వరి ధాన్యం - భారీ నష్టం

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. వేగంగా గాలులు వీయటంతో బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇంటి పైకప్పులు ఎగిసిపడ్డాయి. రేకుల షెడ్లు గాల్లోకి ఎగిసిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. చెట్లు నెలకులాయి. రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. కందకుర్తిలో గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కరెంట్ కు అంతరాయం కలిగింది. అటు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో కురిసిన  గాలి వాన కల్లోలం సృష్టించింది. పలు చోట్ల టీన్ రేకులు చెల్లా చెదురువ్వగా.... మరికొన్ని చోట్ల వరి కొనుగోలు కేంద్రాలలోని వరద నీళ్లు వచ్చి చేరాయి. గాలి వాన ప్రతాపం తో స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందారు. సుల్తాన్ నగర్ గ్రామంలో టీన్ రేకులు ఎగిరి పడ్డాయి. గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ హోటల్ పై కప్పు రేకులతో పాటు మరికొంత మంది పై కప్పులు చెళ్ళ చేదురయ్యాయి. అంతే కాకుండా పలు గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలల్లో వరద నీరు వచ్చి చేరడంతో వరి ధాన్యం కుప్పలు తడవడం తో పాటు కాంట అయిన వరి ధాన్యం బస్తాలు సైతం తడిసి పోవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. గాలివాన ధాటికి తడిసిన ధాన్యానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Tirumala Updates: తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మైనంపల్లి

తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల మైనంపల్లె హనుమంతరావు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని‌ ప్రార్ధించినట్లు తెలిపారు.. ఏపి, తెలంగాణ రాష్ట్రాలు ఎల్లప్పుడూ కలిసి ఉండాలని, తెలంగాణ రాష్ట్రంకు స్వతంత్ర వచ్చిన తరువాత గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధిని కేసిఆర్ చేసారని కొనియాడారు.. మాటల్లో ఏదైనా చేసే వాళ్ళం కాదు, మేము చేతల్లో ఏదైనా చేసే వాళ్ళంమని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుందన్నారు.. అంతే కాకుండా రాబోవు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టి బంపర్ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tirumala Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు ఆది పినిశెట్టి దంపతులు

తిరుమల శ్రీవారిని సినీనటుడు ఆది పినిశెట్టి దర్శించుకున్నాడు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఆది పినిశెట్టి, ఆయన సతీమణి నిక్కిలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయం ముందు సినీ నటుడు ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు.. పెళ్ళి తరువాత మొదటి సారి స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు.. వారియర్స్,శివుడు అనే చిత్రంతో‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఆది పినిశెట్టి తెలిపారు.

Telangana Congress: నేటి నుంచి కాంగ్రెస్ చింథన్ శిబిర్, మొత్తం భట్టి అధ్యక్షతన

ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింథన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు కీసరలో రెండు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయ్‌పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి  టీపీసీసీ ఆమోదం తెలుపుకుంటుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకుంటారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్ హాజరు కానున్నారు.

Background

నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, ఈ ఏడాది గత ఏడాది కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీర్ఘ కాల సగటులో 99 శాతం మేర వర్షాలు పడుతాయని గతంలో ప్రకటించిన ఐఎండీ ఆ ప్రకటనను సవరించింది. దీర్ఘకాల సగటు కంటే 103 శాతం అధికంగా వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని మరికొన్ని భాగాలు.. మొత్తం ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో బెంగాల్, తూర్పు బంగాళాకాతంలోని చాలా ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు మీదుగా ఈ రుతుపవనాలు విస్తరించాయి. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.


ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
ఈరోజు, రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరులతో పాటు  రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి  కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వేగంగా గాలులు వీచడంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని భారత వాతావరణ శాఖ పేర్కొంది. 


తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయి. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ , నారాయణపేట జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం పడే అవకాశం లేదు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.