Breaking News Live Updates : డ్రాగా ముగిసిన భారత్, పాకిస్తాన్ హాకీ మ్యాచ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 23 May 2022 06:44 PM
పాక్‌తో మ్యాచ్ డ్రాగా ముగించిన భారత హాకీ జట్టు

2022 ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది.

Peddapalli News : రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అంతర్గాం తహసీల్దార్ 

Peddapalli News : పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ సంపత్ లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. ఓ భూమి సర్వే విషయంలో 3 లక్షలు డిమాండ్ చేశారు తహసీల్దార్. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బాధితుడి నుంచి లక్ష రూపాయలు తీసుకుంటుండగా తహసీల్దార్ పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు,  తహసీల్దార్ ను అదుపులోకి తీసుకున్నారు. 

TS News : మాజీ ఎంపీ రేణుకా చౌదరి పై ఎఫ్ఐఆర్ నమోదు

TS News : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించిన వైద్యుడు భూక్యా రామ్‌జీ నాయక్‌ భార్య భూక్య కళావతి ఫిర్యాదుతో రేణుకా చౌదరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎమ్ఎస్ చౌదరి, రేణుకా చౌదరి ఏడుగురు అనుచరులపై ఐపీసీ సెక్షన్లు 420, 506, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని 3(1) సెక్షన్‌ల కింద కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. 


 

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు, ఇవాళ అరెస్టు!

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ కేసు విచారణ జరుగుతోందని ఏఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. అనంతబాబు పోలీస్‌ కస్టడీలో ఉన్నారని పేర్కొన్నారు. ఇవాళ అనంతబాబును అరెస్ట్‌ చేస్తామన్నారు. ఈ ఘటన జరిగిన రోజు ఎక్కడున్నారనే విషయంపై గన్‌మెన్లకు సంజాయిషీ నోటీసులను జారీచేశామని ఏఎస్పీ తెలిపారు.

Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో సివిల్ దావా విచారణ ప్రారంభించిన వారణాసి జిల్లా కోర్టు

ఉత్తర ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్వాపి మసీదు కేసులో దాఖలైన సివిల్ పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎకె విశ్వేషా విచారించారు. 19 మంది న్యాయవాదులు, 4 పిటిషనర్లు సహా 23 మందిని మాత్రమే కోర్టు గదిలోకి అనుమతించినట్లు ANI పేర్కొంది.

రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టుకు ఏప్రీ ప్రభుత్వం

విశాఖపట్నంలోని రుషికొండలో తవ్వకాలపై ఎన్టీటీ స్టే ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆదేశించింది. రుషికొండలో తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే, పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లుగా ఏపీ సర్కార్ తన పిటిషన్‌లో వెల్లడించింది. దీంతో త్వరలోనే రుషికొండ తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. 

Rushikonda: రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టుకు ఏప్రీ ప్రభుత్వం

విశాఖపట్నంలోని రుషికొండలో తవ్వకాలపై ఎన్టీటీ స్టే ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆదేశించింది. రుషికొండలో తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే, పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లుగా ఏపీ సర్కార్ తన పిటిషన్‌లో వెల్లడించింది. దీంతో త్వరలోనే రుషికొండ తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. 

Bihar Road Accident: బిహార్‌లో రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పైపుల లోడ్​తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడటంతో 8 మంది దుర్మరణం చెందారు. బిహార్ పూర్ణియాలో ఈ దుర్ఘటన జరిగింది.





ప్రగతి భవన్ ముట్టడికి PDSU, PYS విద్యార్థి సంఘాల యత్నం

* ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన PDSU, PYS విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసిన పోలీసులు


* నిరుద్యోగ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోరుతూ ముట్టడి


* పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య తోపులాట


* జాబ్ క్యాలెండర్ విడుదల, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్

Tirumala News: తిరుమలలో ఏనుగుల హల్చల్

* తిరుమల- పాపవినాశనం మార్గంలోని పార్వేటి మండపం వద్ద సంచరిస్తున్న ఏనుగులు


* వారం వ్యవధిలో రెండవసారి కలకలం రేపుతున్న ఏనుగుల సంచారం


* పాపవినాశనంకు తాత్కాలికంగా భక్తుల ప్రయాణం రద్దు చేసిన టీటీడీ


* ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లింపు చేసే ప్రయత్నం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు


* బాణసంచాలు, డప్పులు కొట్టి ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా చేస్తున్న టీటీడీ


* ఏనుగుల సంచారంతో బెంబేలెత్తి పోతున్న భక్తులు, స్థానికులు

Hyderabad News: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి పట్టివేత

హైదరాబాద్ నగరంలో మరోసారి గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడింది. నగర శివారులోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా గంజాయిని హయత్‌ నగర్ పోలీసులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఓఆర్ఆర్ సమీపంలో గంజాయిని ఓ కారులో నుండి ఇంకో కారులోకి మారుస్తుండగా వీరు పోలీసులకు దొరికిపోయారు. దాదాపు 470 కిలోల గంజాయి, నాలుగు కార్లు, రూ.2 లక్షల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Background

నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే వారం నుంచి పది రోజుల ముందే ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వెళ్లినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాంలో, ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.


ఏపీలో చల్లచల్లగా.. 
దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసరాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. ఇంత ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉన్న ఆవర్తనం ప్రస్తుతం బలహీనపడింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లుండి సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమం కాదని సూచించారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
అసని తుపాను తరువాత మరోసారి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోనూ కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంది. రాష్ట్రంలో 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలలో మార్పు ఉంటుందని అధికారులు తెలిపారు. 


తెలంగాణలో తేలికపాటి జల్లులు..
తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు స్థిరంగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర కూడా నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,050 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,330 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,900 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,900 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,050 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,330గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,900 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.