Breaking News Live: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-ఇన్నోవాను ఢీకొట్టిన లారీ, 8 మంది మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 06 Feb 2022 07:30 PM
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-ఇన్నోవాను ఢీకొట్టిన లారీ, 8 మంది మృతి

అనంతపురం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం. 

చిలకలూరిపేటలో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన జనసేన నేతలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు, కార్యవర్గ నాయకులు పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు.

టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత

టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేలో భాగంగా ఈ ఫార్మాట్లో 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

జేఎన్‌టీయూ కాలేజీలో ర్యాగింగ్.. 18 మంది సీనియర్లు సస్పెండ్

అనంతపురం జేఎన్‌టీయూ కాలేజీ హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు తమ హాస్టల్ కు జూనియర్ విద్యార్థులను పిలిపించుకుని అర్ధరాత్రి వరకు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేపించారు. సీనియర్ల వేధింపులు తాళలేక అధికారులకు జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపాల్ సుజాత.. జూనియర్లను వేధించిన 18 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.

ఆర్ధిక పరిస్థితి బావుంటే మరిన్ని ప్రయోజనాలకు సీఎం జగన్ హామీ

ఆర్ధిక పరిస్థితి బావుంటే భవిష్యత్‌లో మరింత ప్రయోజనాలు ఉంటాయని సీఎం జగన్ చెప్పారు. మేము సాధించిన ప్రయోజనాల  భారం 1300 కోట్ల రూపాయలు. ఐఆర్ రికవరీ వల్ల మరో  5 వేల కోట్లు  భారం పడుతుంది. ఉపాధ్యాయులు ఉద్యోగుల ఐక్యత వల్లే ఇది సాధ్యమైంది. ఇది  ప్రారంభం మాత్రమే.. భవిష్యత్  లో  ఇలాగే ఉద్యోగులు సహకారించాలని భూపరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ఫిట్మెంట్ తప్ప అన్ని విషయాల్లో ప్రభుత్వం సానుకూలం: వెంకట్రామిరెడ్డి

వెంకట్రామిరెడ్డి...


ఫిట్మెంట్ తప్ప అన్ని విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఐదేళ్లకు ఒక సారి పిఆర్సి ఇవ్వడం పిఆర్సి సాధన సమితి విజయం. హెచ్  ఆర్ ఏ స్లాబ్ పెరగడం వల్ల జీతం తగ్గదు. రివర్స్  పిఆర్సికి ఆస్కారం లేదు. మేము చేసిన ఉద్యమ ఫలితంగా కొన్ని అదనపు ఫలితాలు వచ్చాయి.

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చించిన సీఎం వైఎస్ జగన్

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చించిన సీఎం వైఎస్ జగన్.


సూర్యనారాయణ...


చలో  విజయవాడలో  లక్ష మంది ఉద్యోగులు  ఆందోళన  చేశారు. ఫిట్మెంట్ లో పెరుగుదల  లేకపోయినా మిగిలిన  అంశాల్లో  సంతృప్తి ఉంది..వెసులుబాటు  ఉంది. హెచ్ఆర్ ఏ..అదనపు పెన్షన్  సీసీఏ ల వల్ల  ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం  మాకు  సానుకూలంగా ఉంది...

కేంద్ర మంత్రి ముఖాముఖి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో పలువురు మేధావులతో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కారాడ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ఆడిటర్లు, వర్తక, వాణిజ్య వేత్తలతో పాటు ఇతర ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ బడ్జెట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించి ప్రస్తావించాలని.. కాని రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో ప్రస్తావించదని విమర్శించారు. ఏపీలో రూ. 64 వేల కోట్లు రోడ్లకు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. పోలవరం 78 శాతం పూర్తి అయిందని, రాయలసీమలో అత్యధిక ప్రాజెక్టులు కేంద్రం నిర్మిస్తోందని అన్నారు.

మేడారంలో భక్తుల రద్దీ

ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర కన్నులపండువగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్త జనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారక్క జాతర కోసం అక్కడ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మేడారం పరిసరాలు ప్రస్తుతం రద్దీగా మారిపోయాయి.

11వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 11 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు. మొదటగా జనగామ జిల్లాలో పర్యటించనున్న ఆయన తర్వాత నిజామాబాద్‌, హనుమకొండ, జగిత్యాల, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్‌ తదితర జిల్లాలకు వెళ్లనున్నారు. గతంలో పలు దఫాలు వాయిదా పడిన జిల్లా పర్యటనలను ఈసారి ఎలాగైనా పూర్తి చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ జిల్లాల పర్యటనలో ఆయన కలెక్టరేట్‌ భవన సముదాయాలు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తారు. భారీ బహిరంగ సభలను కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బీజేపీపై మరింత స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉంది.

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.


అయితే, తెలంగాణలో ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి పసుపు రంగు అలర్ట్‌ను కూడా జారీ చేశారు.


హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. వాయువ్య దిశ ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.4 డిగ్రీలుగా నమోదైంది. 


ఏపీలో వాతావరణం
అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు కూడా స్థిరంగా ఉంది. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పూ లేదు. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,100గా నిలకడగానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.