Adilabad Lok Sabha Elections 2024: ఆదిలాబాద్‌ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90652 ఓట్ల మెజారిటీ సాధించారు. గోడం నగేష్ కు 5,68,168 ఓట్లు పోలయ్యాయి. ఆత్రం సుగుణకు 477516 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 137300 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్‌లో మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు సత్తా చాటుతున్నాయి. ఉదయం 11.30 గంటల సమయానికి రెండూ పార్టీలు చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోదమ్ నగేశ్ కౌంటింగ్ ప్రారంభం నుంచి ముందంజలో దూసుకుపోయారు. ఈయనకు ఉదయం 11.30 గంటల సమయానికి 2,74,423 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ 45,297 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు.