What's App Calls Cheating : సైబర్ మోసగాళ్లు రోజుగా కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. తాజాగా వాట్సప్ వీడియో కాలింగ్ ను టార్గెట్ చేశారు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్ లు ఉన్న నెంబర్ల నుంచి హాయ్ అని పెడతారు. ఎలా ఉన్నారని పలకరిస్తారు. పొరపాటున రిప్లై ఇచ్చారో అంతే ఒక్కసారిగా వీడియో కాల్ చేస్తారు. కక్కుర్తి పడి కాల్ లిఫ్ట్ చేశారో ఇక అంతే డబ్బులు ఇచ్చేదాకా మీకు బెదిరింపులు వస్తూనే ఉంటాయి. వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే అందమైన అమ్మాయిలు న్యూడ్ ఉంటారు. వాళ్ల స్ర్కీన్లపై మీరు కనిపిస్తున్న వీడియోలను సైబర్ మోసగాళ్లు రికార్డు చేస్తారు. ఆ తర్వాత డబ్బులు ఇస్తే వీడియో డిలీట్ చేస్తామని చెబుతారు. లేదంటే సోషల్ మీడియా పెడతామని బెదిరిస్తారు. ఇలా న్యూడ్ కాలింగ్ తో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.
ఆదిలాబాద్ లో ఇలాంటి ఘటన
వాట్సప్ వీడియో కాల్స్ తో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. హాయ్ అంటూ మొదలైన పరిచయం యువకులను ముగ్గులోకి దింపి అందినంత డబ్బులు దండుకునేందుకు న్యూడ్ వీడియోలతో కవ్విస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తికి ఓ యువతి వాట్సప్ మెసేజ్ లు, వాట్సప్ కాల్స్ చేస్తూ, న్యూడ్ గా వీడియో చూపిస్తూ ఛాటింగ్ చేసింది. చివరికి డబ్బులు ఇవ్వాలంటూ లేదంటే ఈ వీడియోను యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సప్ లో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు గురి చేసింది. దీంతో ఈ వాట్సప్ తతంగాన్ని బాధిత యువకుడు పోలీసులకు తెలియజేశాడు. గుర్తు తెలియని వారితో ఆన్లైన్ వాట్సప్ ఛాటింగ్ చేయొద్దని, మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
వాట్సప్ స్టేటస్ తో ఆగిన పెళ్లి
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపురంకు చెందిన బొద్దుల రాజేష్ అనే యువకుడి పెళ్లి గద్దేరాగడిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రోజు జరుగుతోంది. వివాహ తంతు జరుగుతుండగానే... అక్కడకు ఓ అమ్మాయి వచ్చింది. అచ్చం తెలుగు సినిమాల్లో లాగానే పెళ్లి ఆపండి అంటూ గట్టిగా కేక వేసింది. ఏమైందంటూ అందరూ ఆమెను చూస్తున్నారు. ఆమె వధూవరులిద్దరూ స్నేహితురాలేమో, ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె వచ్చింది వారిద్దరికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి కాదు. షాక్ ఇవ్వడానికి.
వచ్చింది బంధువు కాదండోయ్ వరుడి ప్రేయసి..
అదేంటీ అనుకుంటున్నారా. నిజమండి. ఆమె పెళ్లి కూతురుకో, పెళ్లి కుమారుడికో స్నేహితురాలు అయితే అదే జరిగేది. కానీ వచ్చింది నవ వరుడి ప్రేయసి. పెళ్లి పీఠల మీద కూర్చొని మరో అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు రెడీగా ఉన్న రాజేష్ తనను ప్రేమించాడని, గత ఎనిమిదేళ్లుగా తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు బంధువుల అందరి ముందే చెప్పింది. అందుకే ఆ పెళ్లిని ఆపేసింది. తనను మోసం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు విన్న అమ్మాయి తరపు బంధువులంతా ముక్కున వేలేస్కున్నారు. చోద్యం చూసినట్లుగా చూస్తుండిపోయారు.
రాజేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే ఓ వైపు విలపిస్తూనే మరోవైపు పెళ్లి కొడుకుపై దుమ్మెత్తి పోశారు. ఇలాంటి వాడికా తమ కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెతోపాటే పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు పెళ్లి కుమారుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read : Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!
Also Read : ప్రియురాలు పిలిచింది- వాట్సాప్ స్టాటస్ చూసి ప్రియుడి పెళ్లి ఆపేసింది