దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) గురించి చెప్పాలంటే... 'బాహుబలి'కి ముందు, 'బాహుబలి' తర్వాత అని ఇంతకు ముందు అనేవారు. 'బాహుబలి' రెండు భాగాలతో దేశం మొత్తం తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేశారు ఆయన.
ఇప్పుడు రాజమౌళి గురించి చెప్పాలంటే... 'ఆర్ఆర్ఆర్ : రణం రౌద్రం రుధిరం' చిత్రానికి ముందు, 'ఆర్ఆర్ఆర్' తర్వాత అని చెప్పాలి. ఎందుకంటే... 'ఆర్ఆర్ఆర్' తర్వాత సినిమా పెద్దన్న హాలీవుడ్ అంతా భారతీయ చలన చిత్ర పరిశ్రమ వైపు తిరిగి చూసేలా చేశారు రాజమౌళి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'ఆర్ఆర్ఆర్' విడుదల అయిన తర్వాత హాలీవుడ్ సినిమా ప్రముఖులు పలువురు సినిమా చూశారు. రాజమౌళి ప్రతిభ గురించి... యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూ... ట్వీట్లు చేశారు.
'అవెంజర్స్' డైరెక్టర్స్ రూసో బ్రదర్స్‌తో ఇటీవల ఒక డిస్కషన్ ప్యానల్‌లో రాజమౌళి పాల్గొన్నారు. త్వరలో ' టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్' (Toronto International Film Festival 2022) లో ఇంకా పలువురు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌తో కలిసి పాల్గొననున్నారు.
అవును... సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ జరగబోయే టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (టీఫ్)లో రాజమౌళి భాగం కానున్నారు. ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌తో కలిసి ఆయన చర్చా వేదికలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చలన చిత్రోత్సవాల నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
Also Read : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ
ప్రతి ఏడాది కెనడాలోని టొరంటో నగరంలో ఈ చలన చిత్రోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, పలువురు సినీ ప్రముఖులు చర్చల్లో పాల్గొంటారు. ఈ ఏడాది చిత్రోత్సవాలకు రాజమౌళికి ఆహ్వానం అందింది. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు. రాజమౌళి ప్రతిభ తెలిసేలా అక్కడ 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్' చూసి 'డాక్టర్ స్ట్రేంజ్' రైటర్ సి రాబర్ట్ గిల్, 'స్పైడర్‌మ్యాన్ వర్స్' రైటర్, ప్రొడ్యూసర్ క్రిస్టోఫర్ మిల్లర్ తదితరులు ట్వీట్లు చేశారు. పోర్న్ స్టార్ కేంద్రా లస్ట్ కూడా ''నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' చూశా. ఎన్టీఆర్ (NTR Jr), రామ్ చరణ్ (Ram Charan) నటన... పాటలు... ఫైట్లు... సినిమాటోగ్రఫీ... డైలాగ్ డెలివరీ... ప్రతిదీ పర్ఫెక్ట్. అద్భుతంగా ఉంది. హీరోలు హ్యాండ్సమ్‌గా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్'కు వాళ్ళిద్దరి నటన ఆత్మ లాంటిది'' అని ట్వీట్ చేయడం విశేషం.
Also Read : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?