రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు లిఫ్ట్ స్థలం నుంచి నాలుగు సంవత్సరాలు బాలుడు పడి మరణించాడు. బాలుడి పుట్టినరోజే ఈ దుస్సంఘటన జరగడం అందర్ని కంటతడి పెట్టించింది. చుట్టుపక్కల వాళ్లను కలచివేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతున్న బిల్డర్లు తగిన జాగ్రత్తలు తీసుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. కేసు నమోదు చేసుకున్నా రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు
బంజారాహిల్స్ ఘటనపై స్పందించిన గవర్నర్, ఏమన్నారంటే!
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, మనో వేదనకు గురి చేసిందని తెలిపారు. దారుణానికి పాల్పడ్డ నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. ఇకపై రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. మరోవైపు లైంగిక దాడి ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సఫిల్ గూడలో ఉన్న ఆ పాఠశాల ప్రధాన శాఖ వద్ద ఆందోళనకు దిగారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో LKG చదువుతున్న బాలికపై(4) ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజినీకుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా బాలికను డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. 2 నెలల నుంచి బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లితండ్రులు చిన్నారి ప్రశ్నించారు. అయితే సమాధానం చెప్పలేని పరిస్థితి చిన్నారి ఉన్నట్లు తల్లిదండ్రులు అంటున్నారు. చిన్నారి నీరసంగా ఉండి ఏడవడంతో అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వచ్చి చిన్న పిల్లలను ఇబ్బందులు గురిచేశాడని ఫిర్యాదులో తల్లిదండ్రులు తెలిపారు. ఆగ్రహంతో ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ ను తల్లిదండ్రులు చితక బాదారు. డ్రైవర్ రజినీకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.