MLC Kavita :   లిక్కర్ స్కాం కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత బిజెపి నాయకులపై వేసిన పరువు నష్టం దావా కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కవితపై ఎవరు వాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఢిల్లీ బీజేపీ ఎంపీ  పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా, మీడియా ముందు   ఎలాంటి  వాఖ్యలు చేయకూడదని తెలిపింది. ఈ కేసు విచారణను సెప్టెంబర్13కు వాయిదా వేసింది కోర్టు. కవిత తరఫు న్యాయవాది మోహిత్ రెడ్డి  వాదనలు వినిపించారు.


నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకెళ్లిన కవిత 


ఢిల్లీ లిక్కర్ స్కామ్  విషయంలో కవితపై నిరాధార ఆరోపణలు చేశారని ఆమె తరపున పిటిషన్ దాఖలైంది.  ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఆక్రమ పద్ధతు లను ఎంచుకున్నారని కవిత పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడంతోనే మీడియా లో కథనాలు వచ్చాయి.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన ద్వారా 4.5 కోట్లు మనీష్ సిసోడియా కు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. బాధ్యత యుతమైన పదవిలో ఉన్నవారు ఆధారాలతో ఆరోపణలు చేయాలి, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


కేంద్రంలో ఉన్నది మోడీ కాదు ఏడీ ప్రభుత్వం - ఏడీ అంటే కేటీఆర్ చెప్పిన అర్థం ఏమిటంటే ?


ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై బీజేపీ నేతల తీవ్ర విమర్శలు


ఢిల్లీ బీజేపీ నేతలు దాదాపుగా ప్రతీ రోజూ ప్రెస్ మీట్‌లు పెట్టి కవితపై ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. మీడియాలో కూడా వీటికి విస్తృత ప్రచారం లభిస్తోంది.  ఇవన్నీ తమపై నిందాపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా అవమానించేలా ఉన్నాయని.. ఆగస్టు 21 తేదీన మీడియా సమావేశం లో బీజేపీ నేతలు మాట్లాడిన వీడియో లను కవిత తరపు న్యాయవాదులు కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. 


రెండు రోజుల్లో ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ఆ కుట్ర చేస్తుంది - బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు !


లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు


ఈ కుంభకోణానికి సంబంధించి దేశ వ్యాప్తంగా 31 స్థావరాలపై దాడులు జరిపి 16మందిపై ఎఫ్‌ఐర్‌ దాఖలు చేసిన సీబీఐ.. వారిలో 8 మందిపై ఆదివారం లుకౌట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేసింది. ఇప్పటికే అయిదుగురిని విచారించిన సీబీఐ ఈ 8 మందిని కూడా విచారించే అవకాశాలున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ  కుంభకోణానికి  సంబంధించి  సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  బీజేపీ (BJP) నాయకులు టీఆర్‌ఎస్‌ (TRS)పైన, కవితపైన నేరుగా ఆరోపణలు చేశారు. ఇందులో కవిత భర్త తరఫు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మరికొన్ని వివరాలను బయటపెట్టాయి. ఇప్పుడు కోర్టు ఆదేశించడంతో ఎవరూ ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు