ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ చైనాలో తన కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అదే షియోమీ టీవీ ఈఎస్50 2022. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఈఎస్43, ఈఎస్55, ఈఎస్65 2022 మోడళ్లు లాంచ్ కాగా.. ఇప్పుడు 50 అంగుళాల మోడల్ కూడా వచ్చేసింది. ఈ టీవీద 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించనుంది. దీంతోపాటు ఎంఈఎంసీ మోషన్ టెక్నాలజీ, డాల్బీ విజన్ సపోర్ట్, 96 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఇందులో ఉన్నాయి. దీని స్క్రీన్ సైజు 50 అంగుళాలు కాగా టీవీ పక్కభాగంలో బూడిద రంగు అంచులు ఉన్నాయి. ఇందులో మల్టీ జోన్ బ్యాక్‌లైటింగ్ ఫీచర్ ఉంది.


షియోమీ టీవీ ఈఎస్50 2022 ధర
దీని ధరను 2,399 యువాన్లుగా(సుమారు రూ.28,300) నిర్ణయించారు. ఇందులో కేవలం 50 అంగుళాల వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. గ్రే కలర్‌లో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. చైనాలో డిసెంబర్ 11వ తేదీ నుంచి దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ టీవీలు మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో తెలియరాలేదు.


షియోమీ టీవీ ఈఎస్50 2022 స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 50 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. డీసీఐ-పీ3 కలర్ గాముట్ కవరేజ్ కూడా ఇందులో ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 600 నిట్స్‌గా ఉంది.


డాల్బీ విజన్, ఎంఈఎంసీ మోషన్ టెక్నాలజీ, ఏఎల్ఎల్ఎం ఫీచర్లు ఉన్నాయి. 107 కోట్ల రంగులను ఈ టీవీ డిస్‌ప్లే చేయనుంది. 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ9638 ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. ఏఆర్ఎం కార్టెక్స్-ఏ55 సీపీయూ, ఏఆర్ఎం మాలి జీ52 ఎంసీ1 జీపీయూ, మీడియాటెక్ ఏపీయూ కూడా ఇందులో ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అందించారు.


ఎంఐయూఐ టీవీ3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. ప్యాచ్ వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ వీ5, డ్యూయల్ వైఫై, ఇన్‌ఫ్రారెడ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక ఏవీ పోర్టు, ఒక ఏటీవీ/డీటీఎంబీ పోర్టు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎస్/పీడీఐఎఫ్ పోర్టు, ఒక ఎథర్‌నెట్ ప్లగ్ఇన్ కూడా ఇందులో అందించారు. రెండు 12.5W స్పీకర్లు ఇందులో ఉన్నాయి. టీవీ బరువు 10.35 కేజీలుగా ఉంది. డాల్బీ ఆడియో, డీటీఎస్-హెచ్‌డీ సపోర్టు కూడా ఇందులో అందించారు.


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి