HyperOS in Xiaomi 14 Series: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ తను త్వరలో లాంచ్ చేయనున్న మొబైల్ ఫోన్ల కోసం ఎంఐయూఐ స్థానంలో కొత్త హైపర్ఓఎస్‌ను ప్రకటించింది. కంపెనీ సీఈవో లీ జున్ తెలుపుతున్న దాని ప్రకారం హైపర్ఓఎస్‌పై కంపెనీ ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తుంది.


త్వరలో లాంచ్ కానున్న షావోమీ 14 సిరీస్‌తో పాటు హైపర్ఓఎస్‌ను కంపెనీ ప్రజలకు అందించనుంది. ప్రస్తుతానికి హైపర్‌ఓఎస్ చైనాకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్/ట్విట్టర్‌లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు భవిష్యత్తులో చైనా వెలుపల కూడా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ సీఈవో లీ జున్ సమాధానం ఇచ్చాడు.










రోజురోజుకూ తగ్గుతున్న ఎంఐయూఐ పాపులారిటీ
షావోమీ లాంచ్ చేసిన విజయవంతమైన ఉత్పత్తుల్లో షావోమీ ఎంఐయూఐ కూడా ఒకటి. అయితే గత కొన్ని సంవత్సరాలలో ఎంఐయూఐ దాని ప్రజాదరణను కోల్పోవడం ప్రారంభించింది. కలర్ఓఎస్, ఇతర ఆప్షన్లతో పోలిస్తే ఎంఐయూఐలో ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు. అలాగే కంపెనీ దీన్ని ప్రత్యేకంగా అప్‌డేట్ కూడా చేయలేదు. 


ఎంఐయూఐ అనేది షావోమీ స్మార్ట్ ఫోన్ కంపెనీ రూపొందించిన స్టాక్, ఆఫ్టర్ మార్కెట్ ఫర్మ్‌వేర్. దీనిలో మీరు స్టాక్ ఆండ్రాయిడ్‌లో అందుబాటులో లేని కొన్ని అదనపు యాప్‌లను కంపెనీ నుంచి పొందుతారు. ప్రస్తుతం షావోమీ త్వరలో లాంచ్ చేయనున్న హైపర్ఓఎస్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. దానిలోని ప్రత్యేకత ఏమిటి, ఇది ప్రజలకు ఎటువంటి కొత్త ఫీచర్లను అందిస్తుంది అనే విషయమై రానున్న రోజుల్లో సమాచారం అందుతుంది.


అలాగే షావోమీ త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ షావోమీ 14 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుందని సమాచారం. అలాగే 90W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండే అవకాశం ఉంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial